సినిమా ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కి శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కనివిని ఎరుగని రీతిలో గెలుపు సాధించిన కూటమిని అభినందిస్తూ సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో వేదికగా ట్వీట్లు వేస్తున్నారు, ఎవరెన్ని ట్వీట్లు వేసినా, ఎంతమంది శుభాకాంక్షలు తెలిపినా అందరూ జూనియర్ ఎన్టీఆర్ చెయ్యబోయే ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఏంటి బుడ్డోడి సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఇంకా ట్వీట్ వెయ్యలేదు, ఎవరెన్ని అభినందనలు తెలిపినా ఆ ఒక్కరి ట్వీట్ కోసమే అభిమానులు వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసారు. మరి అందరూ అనుకున్నట్టుగా ఎన్టీఆర్ మావయ్య, బాబాయ్, బావ, అత్త, మరో బావ గెలుపుకి శుభాకాంక్షలు తెలపడమే కాదు.. జనసేన అధ్యక్షులు పవన్ ని కూడా విష్ చేసారు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన @sribharatm కి, @PurandeswariBJP అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన @PawanKalyan గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అంటూ చేసిన ట్వీట్ సెకన్స్ లో వైరల్ గా మారింది.