శ్రీలీల పేరు సినిమాల్లో వినిపించకపోతేనేమి.. సోషల్ మీడియాలో తరచూ బ్యూటిఫుల్ పిక్స్ తో యూత్ ని తన చుట్టూనే తిప్పుకుంటుంది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మరుద్దీ అనుకుంటే.. ఒక్క ఏడాదికే శ్రీలీల కనుమరుగయ్యే ఫలితాలు ఆమెకి షాకిచ్చాయి. వరస సినిమాలు నిరాశపరిచాయి.
మహేష్ లాంటి స్టార్ హీరో కూడా శ్రీలీలని ఆదుకోలేకపోయాడు. దానితో పాప సైలెంట్ అవ్వక తప్పలేదు. లేదంటే ఈ ఏడాది క్రేజీగా స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్ తో బిజీగా కనిపించేది.. ప్చ్.. అయితేనేమి సోషల్ మీడియాలో కిర్రాక్ ఫోజులతో కిక్ ఇస్తుంది.
తాజాగా శ్రీలీల చీరకట్టుతో కనువిందు కాదు దుమ్మురేపింది. గ్లామర్ డాల్ లా స్టైలిష్ గా కనిపించినా శ్రీలీలలోని ట్రెడిషనల్ లుక్ మాత్రం దేన్నీ క్రాస్ చెయ్యలేదు. మిడ్డీస్, ఫ్రాక్స్ ఇలా ఎలాంటి అవుట్ ఫిట్స్ అయినా శ్రీలీల అందం మాత్రం చీరలోనే ఎక్స్పోజ్ అవుతుంది. లైట్ కలర్ సారీ తో స్లీవ్ లెస్ బ్లౌస్ తో లూజ్ హెయిర్ తో కొంటెగా చూస్తున్న శ్రీలీల లేటెస్ట్ లుక్ మాత్రం సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అని అనకుండా ఉండలేరు.