వరస విజయాలతో అభిమానులకి కిక్ ఇస్తున్న నందమూరి నట సింహ బాలకృష్ణ.. అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి లాంటి హ్యటిక్ హిట్స్ నమోదు చేసారు. కేవలం సినిమాల్లోనే కాదు.. ఇప్పుడు రాజకీయాల్లోను బాలకృష్ణ హ్యాట్రిక్ సక్సెస్ సాధించి టీడీపీ కార్యకర్తలకి, అభిమానులకి సూపర్ ట్రీట్ ఇచ్చారు.
హిందూపురం నుంచి వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసారు బాలయ్య. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఆయన అల్లుళ్ళు లోకేష్, భరత్ లు కూడా భారీ మెజారీటీతో విజయం సాధించడం ఆయనకి చాలా ఉత్సాహాన్నిచ్చింది. నందమూరి నట సింహ సినిమాలే కాదు రాజకీయాల్లోనూ సింహమే అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాలయ్య సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోవడమే కాకుండా.. చంద్రబాబు సీఎం గా ప్రమాణస్వీకారం చేసేవరకు బాలయ్య బిజినే. ఆ తర్వాత ఆయన నటిస్తున్న NBK 109 సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తోంది. బాలయ్య బర్త్ డే 10. ఆరోజు ఆయన అభిమానులకి స్పెషల్ ట్రీట్ సిద్ధం చేస్తున్నారు NBK 109 మేకర్స్.