నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రజలు చూస్తూ ఊరుకోరు, అధికార మదంతో రెచ్చిపోయి ఎదుటి వారిపై దురహంకారం ప్రదర్శిస్తే.. అధికారం ఇచ్చిన ప్రజలే బుద్ధి చెబుతారు. ఇప్పుడు ఆంధ్రలో అదే జరిగింది. నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రతి పక్షంపై నోటికొచ్చినట్లుగా మాట్లాడి ఇప్పడు ఓటమి బాధతో, భారంతో ఇంట్లో కూర్చున్నారు వైసీపీ మాజీ మంత్రులు.
వైసీపీ ప్రభుత్వ మంత్రి మండలిలో మంత్రులుగా, ఎమ్యెల్యేలుగా ఉండి అధికార గర్వం నెత్తికెక్కి కొట్టుకున్న కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, అమర్ నాధ్, జోగి రమేష్, సిదిరి అప్పలనాయుడు, వల్లభనేని వంశి ఇలా వైసీపీ ప్రభుత్వాన్ని చూసి రెచ్చిపోయిన అందరికి ప్రజలు ఓటమి రుచి చూపించారు. వయసులో పెద్ద అని కూడా చూడకుండా రోజా, కొడాలి లాంటి వాళ్ళు చంద్రబాబుని ఆయన ఫ్యామిలీని అన్న మాటలు అన్నీ ఇన్నీ కాదు.
లోకేష్ ని పప్పు పప్పు అంటూ వెటకారం చెయ్యడమే కాదు, చంద్రబాబు భార్య భువనేశ్వరిని అనరాని మాటలన్న కొడాలి నాని, రోజాకి వాళ్ళ నియోజకవర్గ ప్రజలే చుక్కలు చూపించారు. ఓటు బ్యాంక్ పదిలంగా ఉన్న అంబటి, బొత్స, కొడాలి లాంటి వాళ్ళే ఓటమి పాలవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
కానీ వారి అధికార మదాన్ని, నోటి దూలని ప్రజలు పర్సనల్ గా పట్టించుకుని.. వాళ్ళ బలుపుని దించేశారు. నోరు పారేసుకుని, పారేసుకుని ఇప్పుడు మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా(ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా) ఇళ్లకే పరిమితం చేసారు. మరి ఎవరితోనైనా పెట్టుకోండి.. ప్రజలతో పెట్టుకోవద్దు అంటూ బుద్దొచ్చేలా చేసారు.