వైసీపీకి పప్పు రుచి తెలిసినట్టేనా..?
పప్పు కాదు నిప్పు అని నిరూపించుకున్న నారా లోకేష్
లోకేష్ పప్పు అంటే గత పదేళ్లుగా వైసీపీ ఒక్కటే విమర్శలు
పప్పు అంటే ఏంటి..? ఎలా ఉంటుందో రుచి చూపించిన లోకేష్
నేను పప్పు కాదు నిప్పని నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు
ఈ ఎన్నికల్లో మంగళగిరికే పరిమితమైన యువనేత
యువగళం పాదయాత్రతో తన సత్తా ఏంటో చూపించిన లోకేష్
పడిన చోటే నిలబడి గెలిచిన నారా వారి అబ్బాయి
తండ్రి సీఎంగా ఉండగా మంగళగిరిలో ఘోర ఓటమి
ఎమ్మెల్సీని చేసి మూడు శాఖలు కట్టబెట్టిన చంద్రబాబు
నాటి నుంచి నేటి వరకూ పప్పు.. పప్పు అంటూ ప్రతిపక్షాలు హేళన
ఎక్కడా నిరాశ చెందకుండా నిత్యం ప్రజలతోనే లోకేష్
మంగళగిరి ప్రజలతో మమేకం అవుతూ తన వంతు సాయం
ఇప్పుడు అదే ప్రజలు ఆశీర్వదించిన పరిస్థితి
గెలుపు కాదు.. కలలో కూడా ఊహించని మెజార్టీ
91వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన నారా లోకేష్
ఈ ఎన్నికల్లో ఇదే మూడో అత్యధిక మెజార్టీ
హేళన చేసిన నోటితోనే మెచ్చుకుంటున్న విమర్శకులు
అయినా విమర్శలు:-
ఇంత జరిగినా కూడా లోకేష్‌పై విమర్శలే
ఎప్పటికైనా పప్పు పప్పే అంటూ ఇంకా విమర్శలు
నిప్పు ఎన్నిరోజులు ఉంటుంది ఆరిపోదా అంటూ సెటైర్లు
లోకేష్‌తో అంటే అట్లుంటది మరి అని టీడీపీ రివర్స్ అటాక్
ఎవర్నీ తక్కువ అంచనా వేయొద్దు.. ప్రతి ఒక్కడికీ ఓ టైమ్ వస్తుందని..
ఇప్పుడు లోకేష్‌కు టైమ్ వచ్చిందని ప్రతి కౌంటర్లు
ఇప్పుడు టచ్ చేయండ్రా పప్పు, నిప్పును అంటున్న టీడీపీ శ్రేణులు!