నిన్న సోమవారం బెంగుళూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి నటి హేమ కి మూడోసారి నోటీసులు ఇవ్వడమే కాకుండా ఆమెని ఉదయం నుంచి సాయంత్రం వరకు బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో విచారించి సాయంత్రం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
హేమ ని అరెస్ట్ చేసి వైద్యపరీక్షల నిమిత్తం ఆమెని ఆసుపత్రికి రమ్మనగా ఆమె బురఖా ధరించి మీడియా కంట పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేసింది. వైద్య పరీక్షల అనంతరం హేమ ని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. ఆమెకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. 14 రోజుల పాటు హేమ ని విచారించేందుకు పోలీసులు అనుమతి తీసుకున్నారు.
బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించడంతో ఆమెని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హేమ తప్పు చేసినట్లుగా తేలితే ఆమెకి భారీ జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటున్నారు.