హేమ ఎన్ని విధాలుగా తప్పించుకుని తిరుగుదామనుకున్న సోషల్ మీడియా హేమ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఆడుకుంటూనే ఉంది. గత నెలలో బెంగుళూరు రేవ్ పార్టీలో కీలకంగా వ్యవహరించి.. పోలీసులకి దొరికినా.. నేను కాదు, నేను బెంగుళూరులో లేను, హైదరాబాద్ లో ఉన్నాను అంటూ బిల్డప్ ఇచ్చిన హేమని పోలీసులు అంత తేలిగ్గా వదులుతారా.. అసలే డ్రగ్స్ తీసుకున్న కేండేట్స్ లో హేమ కూడా ఉందాయే.
అందుకే హేమ కి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవమంటే నాకు ఫీవర్ అంటూ ఒకసారి, రెండోసారి రాలేను అంటూ బెంగుళూరు పోలిసుల నుంచి తప్పించుకున్న హేమ ని మూడోసారి నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరవ్వక తప్పలేదు. బెంగళూరు పోలీసుల అదుపులో హేమ. హేమను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం.
రేవ్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన హేమ ని ఉదయం నుంచి సీసీబీ పోలీసులు విచారించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచే ముందు హేమ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే హేమ మీడియా కంటపడకుండా ఉండేందుకు బుర్ఖాలో వచ్చింది. ఆమెకు ఆ బుర్ఖాలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. దానితో అందరూ హేమ ఈసారి బురఖాతో మాయ చేద్దామనుకున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.