ఈమధ్యన హిందీ ప్రాజెక్ట్స్ చేస్తూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న రాశి ఖన్నా మళ్లీ సౌత్ లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అనుభవిద్దామని కలలు కన్న రాశి ఖన్నాకి స్టార్ హీరోలు ఛాన్సులు ఇవ్వకుండా మొహం చాటెయ్యడంతో ఆమె సౌత్ ని పక్కనపెట్టి బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.
అక్కడ సక్సెస్ అయినా అవ్వకపోయినా.. సోషల్ మీడియాలో రాశి ఖన్నా గ్లామర్ షో మాత్రం విపరీతంగా హైలెట్ అవుతుంది. ఎప్పుడు మోడ్రెన్ గర్ల్ గా కనిపించేందుకు ఇష్టపడే ఈ భామ ఇప్పుడు బాగా స్లిమ్ గా మారటమే కాదు.. గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. అలాగే అందాలు ఆరబొయ్యడంలో ఎక్కడా తగ్గడంలేదు.
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో రాశి ఖన్నా షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే, మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నిజంగా రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్ మాములుగా కనిపించలేదు.. అంతకుమించి అనేలా ఉంది. మీరు రాశి ఖన్నా గ్లామర్ షో పై ఓ లుక్కెయ్యండి.