మే 13 వరకు ఎన్నికల్లో చాలా హడావిడి చేస్తూ కూటమి నేతలకు వెన్ను దన్నుగా నిలిచి, జనసైనికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపి, ఎండనకా వాననకా ప్రజల్లోనే తిరిగుతూ అనారోగ్యాన్ని సైతం లెక్క చెయ్యని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి నేరుగా మే 13 తర్వాత వారణాసి వెళ్లారు. ఆ తర్వాత మళ్ళి ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు.
పవన్ ఎక్కడ, పవన్ ఎక్కడికి వెళ్ళాడంటూ వైసీపీ నేతలు నానా గోల చేసినా పవన్ కళ్యాణ్ బయటికి రాలేదు. అసలు రేపు ఫలితాలు రాబోతున్నాయి. నిన్న గాక మొన్న ఎగ్జిట్ పోల్ సర్వేల్లో జనసేన విజయకేతనం ఎగరవేసే ఫిగర్స్ చెప్పారు, పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ సైలెంట్ గానే ఉన్నారు.
గత శుక్రవారం చంద్రబాబు, పురందరేశ్వరి లతో పవన్ ఉండవల్లి బాబు ఇంట్లో చర్చలు జరుపుతారని అన్నారు అదీ జరగలేదు. ఇప్పటికే చంద్రబాబు విజయవాడలో అడుగుపెట్టారు. లోకేష్ భార్యతో సహా విజయవాడకి వెళ్లిపోయాడు. అయినా పవన్ జాడ లేదు. అసలు పవన్ ఏం చేస్తున్నట్టు. ఫలితాలు వచ్చేస్తున్నాయి. కూటమి విజయం ఖాయమనే సంకేతాలు అందాయి.
పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో గేమ్ చేంజర్ కాబోతున్నారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ జాడ కానరావం లేదు. అసలు ఎందుకింత సైలెంట్ గా ఉన్నారు పవన్.