త్వరలోనే పెళ్ళి పీటలేక్కబోతున్న లవ్ బర్డ్స్ సిద్దార్థ్ - అదితి రావు లు ప్రస్తుతం టుస్కానీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో(మహాసముద్రం షూటింగ్ సమయం నుంచి) డేటింగ్ లో ఉండి.. తమ రిలేషన్ ని సీక్రెట్ గా మైంటైన్ చేసిన ఈ జంట.. ఈ మధ్యనే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది
ఫైనల్ గా ఆ విషయాన్ని అదితి రావు బయటపెట్టింది. సిద్దార్థ్ తాను తమ పూర్వికులు నిర్వహిస్తున్న టెంపుల్ లో నిశ్చితార్ధం చేసుకున్నామని చెప్పింది. ఇక ఇది సీక్రేట్ ఎంగేజ్మెంట్ కాదు ప్రవేట్ ఫంక్షన్ అందుకే ఎవ్వరికి చెప్పలేదు అంటూ సిద్దార్థ్ కూడా అదితి తో రిలేషన్ పై ఓపెన్ అయ్యాడు. ఇక ఈ లవ్ బర్డ్స్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
అయితే సిద్దార్థ్-అదితి రావు ల వివాహానికి సంబందించిన తేదీ ని ఇంకా నిర్ణయించలేదు అని తెలుస్తోంది. ఈలోపులో ఈ ప్రేమ జంట ఇటలి టూర్ వేసింది. ఇటలీలోని టుస్కానీ నగరంలో సిద్దార్థ్-అదితి రావు లు ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లవ్ బర్డ్స్ సమ్మర్ వెకేషన్ ని బాగానే ఎంజాయ్ చేస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.