గేమ్ చేంజర్ షూటింగ్ కి అంతు పొంతు లేకుండా పోయింది. శంకర్-రామ్ చరణ్ ఇద్దరూ గేమ్ చేంజర్ షూటింగ్ ని ఎప్పుడు ఫినిష్ చేస్తారా అని మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ 2 ప్రమోషన్స్ మొదలైపోయాయి. జులై లో ఇండియన్ 2 రాబోతుంది. అసలు గేమ్ చేంజర్ ఎప్పుడు విడుదల చేస్తారో అనేది తేలడం లేదు.
అక్టోబర్ అంటూ మేకర్స్ అప్పుడప్పుడు చెప్పడం తప్ప పర్టిక్యులర్ డేట్ ఇవ్వకుండా మెగా అభిమానుల సహనానికి పరిక్ష పెడుతున్నారు. అసలు షూటింగ్ ఎంతవరకు ఫినిష్ అయ్యిందో అనేది కూడా క్లారిటీ లేదు. తాజాగా గేమ్ చేంజర్ షూటింగ్ పై ఓ క్రేజీ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గేమ్ చేంజర్ కి సంబందించిన షూటింగ్ మరో 30 రోజుల పాటు ఉండొచ్చట. అందులో రామ్ చరణ్ కి సంబంధించి ఓ పది రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి షూటింగ్ పూర్తి కాగానే శంకర్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఎమన్నా తెలుస్తారేమో చూడాలి.