హెడ్డింగ్ చూడగానే.. ఇదేంటబ్బా ఇంత విచిత్రంగా ఉందని అనిపించింది కదూ! అవునండోయ్ ఈ రెండు పేర్లు, మనుషులకు చాలా దగ్గరి సంబంధమే ఉంది. ఇంతకీ ఏం జరిగింది..? బండ్ల గణేష్ ఏమో నటుడు, ప్రొడ్యూసర్.. ఇక బుద్ధా వెంకన్న టీడీపీ నేత కదా..? టాలీవుడ్.. ఏపీ రాజకీయాలు సెట్ అవ్వలేదు.. పోనీ బండ్ల ఏమైనా ఏపీ మనిషా అంటే అదీ లేదు.. ఇదీ కాదు బుద్ధాతో ఏమైనా సంబంధం ఉందా..? అబ్బే అస్సలు లేదు.. మరి ఎలా సెట్ అయ్యింది.. అస్సలు అయ్యే పనులేనా..? అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయ్ కదూ.. ఇంకెందుకు ఆలస్యం దీనికిపై క్లియర్ కట్‌గా క్లారిటీ రావాలంటే ఆలస్యం చేయకుండా ఈ స్పెషల్ చదివేయండి మరి.
రండి.. వచ్చేయండి!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవకపోతే గొంతు కోసుకుంటానని బండ్ల గణేష్ సవాల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ కావడం.. 7 ఓ క్లాక్ బ్లేడ్ పట్టుకుని బండ్ల వెంబడి మీడియా, బీఆర్ఎస్ కార్యకర్తలు తెగ తిరిగారు. ఆయన ఎక్కడ కనిపించినా చాలు ఏం కథ..? ఎప్పుడు గొంతు కోసుకుంటున్నావ్..? అని అడిగినవారే. సరే కానివ్వండని ఒక్క ఛాన్స్ ఇస్తే గొంతుకోసేసే పరిస్థితి నాడు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే.. అప్పటి వరకూ నటుడిగా అదేనబ్బా కమెడియన్‌గా, నిర్మాతగా కాస్తో కూస్తో పేరున్న బండ్లకు బ్లేడ్ గణేష్ అని పేరొచ్చింది. ఇంకొందరు అయితే బండ్ల గణేష్ అలియాస్ బ్లేడ్ గణేష్ పేరు పెట్టేశారు. దీనంతటికీ కారణం ఒకే ఒక్క ఇంటర్వ్యూ అంతే.. ఇక మీడియాలో, సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా ఈయన గురించే చర్చ.. ఇక మీమ్స్ అయితే లెక్కలేనన్ని.. నాటి నుంచి నేటి వరకూ ఈ బ్లేడ్ ఈయన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాస్త ట్రోలింగ్ ఆపారు.
బుద్దా.. ఇవన్నీ అవసరమా..?
బండ్ల గణేష్ గురించి పూర్తిగా అర్థమైంది కదా.. ఇప్పుడు అంతకుమించి సవాళ్లు చేస్తున్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. 2019 ఎన్నికల్లో తొడగొట్టి.. వైసీపీని పడగొడతాం.. అధికారంలోకి వస్తామని తెగ ప్రగల్భాలు పలికి అడ్రస్ లేకుండా పోయిన ఈయన.. ఎగ్జిట్ ఫలితాలు అలా వచ్చాయో లేదో మీడియా ముందుకు వచ్చి మళ్లీ రచ్చ షురూ చేశారు. ఈసారి ఏకంగా కూటమి గెలవకపోతే నాలుక కోసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దాదాపు అన్ని సర్వేలు కూటమికే ఓటేశాయని.. ఆరా మస్తాన్ మాత్రం వైసీపీ గెలుస్తుందని చెప్పడంతో నేరుగా ఆయనకే బుద్దా సవాల్ విసిరారు. కూటమి గెలవకపోతే నేను నాలుక కోసుకోవడానికి సిద్ధం.. మరి వైసీపీ ఓడితే మీరు సిద్ధమేనా మస్తాన్ అంటూ ఒక్కటే ఛాలెంజ్‌లు. దీంతో నాడు బండ్ల.. నేడు బుద్ధా అని జనాలు, నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆరా మస్తాన్ ఫెయిల్ అయినట్లు ఎక్కడా లేదు. అందుకే నాలుక కోసుకోవడానికి రెడీగా ఉండు బుద్ధా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.. సోషల్ మీడియాలో కామెంట్ల వర్షమే. రేపొద్దున్న రిజల్స్ట్ ఎలా ఉంటాయ్..? బుద్ధా వర్సెస్ మస్తాన్‌లో ఎవరు గెలుస్తారు..? వైసీపీ గెలిచాక వెంకన్న ఏమతారు..? అనేది చూడాలి. ఇప్పుడు అర్థమైంది కదూ.. బుద్దాకు బండ్ల గణేష్‌కు ఉన్న సంబంధమేంటన్నది.. ఇదన్న మాట సంగతి..!