ఇప్పటివరకు అంటే గత పదేళ్లుగా గెలుపు చవి చూడని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గ నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడం కాదు.. పలు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ లో చెప్పడంతో పవన్ గెలుపు ఖరారైపోయింది. రేపు వెలువడనున్న ఫలితాల్లో జనసేన భారీగా సీట్లు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు.
అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సీట్లు రావేమో అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. చాలా సర్వేల్లోనూ వైసీపీ కి 70 నుంచి 75, కూటమికి 90 నుంచి 100 సీట్లు వచ్చే ఛాన్స్ వుంది అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించనుండడం మాత్రం స్పష్టమవుతుంది.
అందుకే ఈ ఫలితాల్లో జనసేన గెలుపు కీలకంగా మారనుంది అంటున్నారు. టీడీపీ, వైసీపీ ఇద్దరికి మెజారిటీ రాకపోతే.. పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పవన్ కళ్యాణ్ జనసేనని గెలిపించుకుని ఈ ఎన్నికల్లో ఏర్పడబోయే ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చెయ్యడం పక్కా. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం ఖాయమనే మాట పలు సర్వేలు చెబుతున్నాయి.