మరో 30 గంటల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రంగం సిద్ధమైపోయింది. జూన్ 4 మంగళవారం ఉదయం మొదలు కొని ప్రజలంతా టీవీ లకి అతుక్కుపోవడమే మిగిలింది. గెలుపు మాదే అని ధీమాతో ఉన్న వైసీపీ కి గట్టి షాక్ తగలబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. జగన్ మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు అంటున్నారు. మరోపక్క చంద్రబాబు గెలుపుకి దగ్గరగా ఉన్నారు, ఈసారి కూటమిదే ప్రభుత్వమంటున్నారు.
కేవలం మాటలే కాదు.. ప్రస్తుతం తాడేపల్లి, ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న తీరు చూస్తుంటే చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఉండవల్లి లోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంపు అలాగే తెదేపా రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది పెంపు. అంతేకాకుండా టీడీపీ కార్యాలయం వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యడం చూస్తే టీడీపీ అంటే అభిమానం ఉన్న ప్రతోడు, జగన్ పాలన్ నచ్చని ప్రతి ఒక్కరు ఇది కదా మజా అంటూ మాట్లాడుకుంటున్నారు.
అయితే ఇదంతా చంద్రబాబు అధికారంలోకి రాబోతున్న సంకేతాలతో ఆయన ఇంటికి, టీడీపీ కార్యాలయానికి భద్రత సిబ్బందిని పెంచుతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరకు వచ్చే నేతలు, కార్యకర్తల కోసం ఆయన ఇంటి వద్ద కూడా పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.