పాపం శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ కి బాలీవుడ్ అస్సలు అచ్చి రావడం లేదు. అక్కడ వరస సినిమాలు చేస్తుంది.. గ్లామర్ షో మెండుగా ఉంది.. అయినా సక్సెస్ అనేది జాన్వికి ఆమడ దూరంలోనే ఆగిపోతుంది. బాలీవుడ్ లో తనని తాను నిరూపించుకున్నాకే సౌత్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న జాన్వీ కపూర్ ని హిందీ అడుగడుగునా నిరాశ పర్చడంతో చివరికి సౌత్ కి వచ్చి చేరింది.
తాజాగా జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి కూడా ఆమెకి నిరాశ పరిచే రిజల్ట్ ఇవ్వడం గమనార్హం. రాజా కుమార్ రావు తో కలిసి నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత నెల రోజులుగా జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు ఈ చిత్రానికి చేస్తున్న ప్రమోషన్స్ చూస్తే సినిమా హిట్ అనే అనుకున్నారు. కానీ మొదటి రోజే ఈ చిత్రం నిరాశపరిచింది.
డైరెక్టర్ శరణ్ శర్మ ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోగా.. గతంలో చాలా సార్లు చూసిన ఫీలింగే కలుగుతుంది, ఎప్పటి నుంచొ క్రికెట్ నేర్చుకున్నానని జాన్వీ పలు సందర్భాల్లో చెప్పింది. కానీ అంతగా ఎక్కడా ఆ క్రికేట్ సీన్స్ పండలేదు. కథలోకి వెళితే.. రాజ్ కుమార్ రావు అనుకోకుండా డాక్టర్ అయిన జాన్విని వివాహం చేసుకుంటాడు. తాను కలగన్న క్రికెట్ ని తన భార్య ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు. మరి ఇలాంటి రొటీన్ కథలు ఇప్పటికే స్క్రీన్ పై ఎన్నోసార్లు చూసిన ఆడియన్స్ ని మిస్టర్ అండ్ మిస్సెస్ మహిని తిరస్కరించేలా చేసాయి.
పాపం జాన్వీ కపూర్.. మరోసారి బాలీవడో ఆమెని నిరాశపరిచేలా చేసింది. మరి ఎన్టీఆర్-రామ్ చరణ్ ఆమెకి సక్సెస్ ఇవ్వాలని దేవుడు రాసిపెట్టాడేమో.. అందుకే హిందీ ఆమెకి కలిసి రావడం లేదు అంటూ ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.