ఒకటి రెండు సర్వే ల్లోనే వైసీపీ విజయం సాధిస్తుంది అని నిన్నటి ఎగ్జిట్ పోల్ సర్వే లు చెబితేనే అదేదో అప్పుడే గెలిచేశామా అన్నట్టుగా వైస్సార్సీపీ నేతలు సంబరాలు చేసుకుంటుంటే.. అత్యధిక సర్వేల్లో కూటమి గెలుస్తుంది అన్న వార్తలు చూసి కూడా టీడీపీ వాళ్ళు కిమ్మనకుండా ఉండిపోవడం ఎవ్వరికి అంతుబట్టడం లేదు.
35/40 సర్వే లు కూటమి గెలుస్తుంది అని చెప్పినా కూడా, కూటమి సభ్యులు ఎందుకు సంబరాలు జరుపుకోవటం లేదు.. E.C. నిభందనలు వున్నాయనా, లేదంటే ప్రస్తుతం వచ్చిన సర్వేల మీద నమ్మకం లేకనా, ఒకవేళ తొందరపడి ముందే సంబరాలు చేస్తే రిజల్ట్ తేడాగా వస్తె పరువు పోద్దేమో అనే ఫీలింగ్ లో వున్నారా.. కాదు.. రిజల్ట్ వచ్ఛాక ఎలాగూ గెలుస్తాము.. అప్పుడే చెద్దాములే అనుకుంటున్నారేమో.. అంటూ కూటమి మౌనాన్ని రకాలుగా మాట్లాడుతున్నారు నెటిజెన్స్.
ఇక నిన్న శనివారం వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏపీ మూడ్ ను లోతుగా అద్యయమం చేయలేకపోయాయని కూడా మాట్లాడుతున్నారు. వైసిపికి ఖచ్చితంగా 140 సీట్లు వస్తాయి, ఆ ఫిగర్ దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని ఆ పార్టీ ధీమాగా ఉంది.. కాని ఆ పిగర్ ఎవ్వరూ ఇవ్వలేదు. టిడిపికి 130 వస్తాయని కొందరు చెబుతున్నా కూటమిలోని నేతలకే క్లారిటీ లేదు.. అందుకే మౌనాన్ని వహిస్తున్నారు అంటున్నారు.
మరి జూన్ 4 న జరగబోయే సెలెబ్రేషన్స్ లో ఏ పార్టీ ఉంటుంది, ఏ పార్టీ ఓడిపోయి సైలెంట్ అవుతుంది అనేది ఇప్పుడు అందరూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.