నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ లో ఆరా మస్తాన్ ఏపీలో వైసీపీ ప్రభుత్వం 94 సీట్ల నుచి 104 సీట్ల వరకు గెలుచుకోబోతుంది.. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, జగన్ సీఎం అవుతాడని ఆరా మస్తాన్ తన ఎగ్జిట్ పోల్ సర్వే లో చెప్పాడు. ఈ ఆరా మస్తాన్ అన్నవాడు గతంలో వైసీపీ సోషల్ మీడియా కి పని చేసాడు. 2019 ఎన్నికల ముందు అంటే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కి ముందు ఆరా మస్తాన్ వైసీపీ కి పని చేసాడు.
ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తర్వాత ఆరా మస్తాన్ వైసీపీ దూరమయ్యాడు. అందుకే ఆరా మస్తాన్ వైసీపీ కి అనుభూతి పరుడిగా తన ఎగ్జిట్ పోల్ ని చెప్పాడు, లేదంటే అన్ని సర్వేలు కూటమి గెలుస్తుంది అంటే ఆరా మస్తాన్ మాత్రమే వైసీపీ గెలుస్తుంది అని చెప్పడంతోనే అతను వైసీపీ మనిషి అని అర్ధమైంది అంటూ టీడీ నేతలు, జనసేన నేతలు ఆరా మస్తాన్ సర్వే పై విరుచుకుపడుతున్నారు.
అయితే ఆరా మస్తాన్ తాను చెప్పినట్టుగా వైసీపీ 94నుంచి 104 సెట్లు గెలవకపోయినా, కూటమి 71 నుంచి 81 సీట్లకి పరిమితం కాకపోయినా ఆరా మస్తాన్ అనేవాడు ఉండడు అంటూ ఛాలెంజ్ చేస్తున్నాడు. తన ఎగ్జిట్ పోల్ సర్వే ఖచ్చితమైంది అని ఈ ఎన్నికల్లో వైసీపీ కి ప్రజలు పట్టం కట్టారంటూ ఆరా మస్తాన్ ప్రకటించాడు.
మరి జూన్ 4 న ఆంధ్రలో ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది.