2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేసాము, మేము నిజమే చెప్పాము, మా ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయని చాలా సర్వే సంస్థలు చెబుతున్నా ఈరోజు వదిలిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఓటర్లని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేశాయని చెప్పాలి.
ఈసారి ఓటర్లెవరూ తాము ఎవరికి ఓటేసామో అనేది నిజం చెప్పలేదని అంటున్నారు. జూన్ 4 ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దు అంటున్నారు నిపుణులు. ఈసారి ఓటర్లు తెలివిమీరి పోయారు, తామెవరికి ఓటేసామో, ఎవరు సీఎం అయితే బావుంటుంది అనే విషయం చెప్పకుండా ఎగ్జిట్ పోల్ సంస్థలనే బురిడీ కొట్టించారనే టాక్ బాగా హైలెట్ అయ్యింది.
ఈ లెక్కన వైసిపి, టీడీపీ కూటమి తరపున జరిగిన సర్వేలు నిజమైన అంచనాలను వెల్లడి చేయలేవు.. 2024లో ఓటరు నిజం మాట్లాడలేదు. ఓటు ఎవరికి వేసినది చెప్పలేదు.. చెప్పే పరిస్థితులు లేవు.. నిజం చెప్పని ప్రజలు ఒక పక్కా, అర్దం పర్డం లేని సర్వేలతో విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఒక పక్క, జూన్ 4వ తేదీ మంగళవారం ఉదయం నుండి మొదలయ్యే ఫలితాల కోసం వెయిట్ చెయ్యడం తప్ప కంగారు పడి టెన్షన్ పెంచుకోవద్దు..