గెలుస్తాము, గెలుస్తున్నాము, గెలిచే తీరతాం.. జూన్ 9 న వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వైస్ జగన్ మళ్ళీ సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తాడు... అందుకే వైజాగ్ లో ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేస్తున్నాము అంటూ వైసీపీ నేతలు ఎంతగా చెబుతున్నా.. కొంతమంది మాత్రం ఏం అభివృద్ధి చేసారు అని మళ్ళీ గెలుస్తారు. ఆంధ్ర ప్రాంతం జగన్ వచ్చాక 100 ఏళ్ళు వెనక్కి పోయింది.
కేవలం బడుగు బలహీన వర్గాలని గ్రిప్ లో పెట్టుకునేందుకు వాళ్ళని సోమరిపోతులని చేస్తూ డబ్బు బ్యాంకు లో వేశావు. పేదలకు, పెద్దవాళ్లకి విడతలవారీగా పెన్షన్ ఇచ్చావ్ బావుంది.. కానీ ఆ పథకం, ఈ పథకమంటూ డబ్బులు బ్యాంకు లో జమ చేసావ్ కానీ.. రాష్టాన్ని సర్వనాశనం చేసావ్. ఎక్కడా అభివృద్ధి లేదు. రోడ్లు నాశనమైపోయాయి.
అటు ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని చూసావ్. వాళ్ళని ఇష్టం వచ్చిన కేసులు పెట్టి జైల్లో పెట్టించావ్. ప్రతిపక్షాన్ని తొక్కేయాలని చూసిన నువ్వు రాష్ట్రాన్ని గాలికొదిలేసావ్. చంద్రబాబు, దత్తపుత్రుడు అంటూ పవన్ పెళ్లిళ్లపై దిగజారి కామెంట్స్ చేసావ్.. ఏం చూసి నిన్ను గెలిపిస్తారని నువ్వు అనుకుంటున్నావు.. ఎందుకంత ధీమా ప్రదర్శిసున్నావు.
కూటమి గెలుస్తుందో.. లేదో తర్వాత విషయం.. కానీ నువ్వు ఎలా గెలుస్తావ్.. ప్రజలకి మంచి చేశా అంటూ ఓటు బ్యాంకు కాపాడుకుని.. మిగతా రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించావ్.. అంటూ ఏపీలోని అనేకమంది ప్రజలు జగన్ పై, వైసీపీ నేతలపై చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.