ఇంకాస్త ప్రమోషన్స్ చేసుంటే..
కొన్నాళ్లుగా విజయం కోసం ఆరాటపడుతున్న కార్తికేయకి భజే వాయు వేగం కాస్త ఊరటనిచ్చేట్టుగానే కనిపిస్తుంది. మొదటిరోజు అంటే మే 31 శుక్రవారం విడుదలైన భజే వాయు వేగం చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ వినిపించినా.. ప్రేక్షకులు మాత్రం నిన్న విడుదలైన మూడు సినిమాల్లో భజే వాయు వేగం బావుంది అంటున్నారు.
భజే వాయు వేగం టాక్ కి ఇంకాస్త ప్రమోషన్స్ తోడయినట్లయితే.. ఈ చిత్రానికి ప్లస్ అయ్యేది. పెద్ద బ్యానర్ యువి క్రియేషన్స్ నుంచి వచ్చిన భజే వాయువేగం ప్రమోషన్స్ పరంగా మిగతా రెండు సినిమాలతొ పోలిస్తే చాలా వీక్ గా కనిపించడమే కాదు, కార్తికేయ ట్రాక్ రికార్డ్ కూడా భజే వాయు వేగంపై క్రేజ్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషించింది.
ఇప్పుడు సినిమా విడుదలైన కొద్ధి గంటల్లోనే భజే వాయు వేగం బావుందంటగా అంటూ ఆడియన్స్ ట్వీట్స్ చేస్తుంటే.. అయ్యో కార్తికేయ అండ్ టీం ఈ చిత్రాన్ని ఇంకాస్త ప్రమోట్ చేసుకుంటే కలెక్షన్స్ పరంగా హెల్ప్ అయ్యేది. సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్ కాదు.. ప్రేక్షకుల్లోకి ఈ సినిమా తీసుకెళ్లేలా టీమ్ కష్టపడాలి అంటూ నెటిజెన్స్ కార్తికేయ అండ్ భజే వాయు వేగం మేకర్స్ కి సలహాలు ఇస్తున్నారు.