Advertisement
TDP Ads

మోడీ 3.0.. నమ్మని తెలుగోడు..!!

Sat 01st Jun 2024 02:32 PM
modi  మోడీ 3.0.. నమ్మని తెలుగోడు..!!
Modi 3.0.. will not believe..!! మోడీ 3.0.. నమ్మని తెలుగోడు..!!
Advertisement

మోడీ 3.0 నమ్మని తెలుగు రాష్ట్రాలు!!

అవును.. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీని తెలుగోడు నమ్మలేదు.. కాదు కాదు అస్సలు నమ్మలేదు. ఎందుకంటే.. ఏపీ సంగతి అటుంచితే తెలంగాణలో పరిస్థితులు అస్సలు బాగలేవని స్వయాన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పేసారు. తెలంగాణాలో గోవిందా గోవింద అంటూ అంచనాలు అందుకోలేకపోతున్నమని చెప్పకనే చెప్పేసారు. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు లబోదిబో మొత్తుకుంటున్న పరిస్థితి. ఇంతకీ నడ్డా ఏం చెప్పారు..? ఎగ్జిట్ పోల్స్ ముందు ఎందుకు ఇలా బాంబ్ పేల్చారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి.

ఏం జరిగింది..?

తెలంగాణలో ఎప్పటికైనా పాగా వేస్తామని బీజేపీ ఎన్నో కలలు కంటున్న పరిస్థితి. ఇందుకు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు కానీ  గట్టి పోటీ ఇచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే గెలిచి చూపించింది. ఐతే రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవచ్చని అంచనాలు వేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు. ఈసారి తెలంగాణా లోకసభ ఎన్నికల్లో బీజేపీకి తక్కువలో తక్కువ 8-10 సీట్లు వచ్చే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. నేఈ క్రమంలో జేపీ నడ్డా చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారింది. తెలంగాణాలో 4-5 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పుకునే మోడీకి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అస్సలు ఓట్లు రాలే ఛాన్స్ లేనే లేదని తెలిసిపోయింది అన్న మాట. 

ఇక ఏపీలో సంగతేంటి..? 

నడ్డా మాటలతో కంగుతిన్న కమలనాథులు...ఇంత పెద్ద మనిషి నాలుగు నుంచి ఐదు సీట్లు మాత్రమే అని చెప్పారంటే కచ్చితంగా సోర్స్ లేనిదే.. సర్వేలు తెలియనిదే ఇలా మాట్లాడరు కదా..? అని గుసగుసలాడుకుంటున్నారు. బీజేపీ కాస్తో కూస్తో ఉన్న తెలంగాణలోనే బీజేపీ పరిస్థితి ఇలా అంటే ఏపీలో ఎలా ఉంటుంది..? కూటమితో జత కట్టిన టీడీపీ, జనసేన పార్టీల పరిస్థితి ఏంటి..? అని లెక్క లేస్తున్నారు పార్టీల నేతలు. మొత్తానికి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మోడీని అస్సలు నమ్మలేదని నడ్డా మాటలతో క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. మరి నడ్డా మాటలు ఏ మాత్రం నిజం అవుతాయి..? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు వస్తాయి..? తెలుగోడు బీజేపీని ఆదరించాడా లేదా..? ఏపీలో కూటమి పరిస్థితి ఏంటి..? అనేది జూన్ నాలుగో తారీఖున తేలిపోనుంది.

Modi 3.0.. will not believe..!!:

Telugu states that do not believe in Modi 3.0!!

Tags:   MODI
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement