జూన్ 4 న మనమే గెలుస్తున్నాం, జూన్ 9 న ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నామంటూ వైస్ జగన్ మాత్రమే కాదు.. వైసీపీ మంత్రులు, నేతలు చాలా నమ్మకంతో చెబుతూ వస్తునారు. మే 13 ఎలక్షన్ పూర్తి కావడం తరువాయి.. వైసీపీ నేతలంతా మీడియా ముందు చాలా కాన్ఫిడెంట్ గా జగన్ గెలవడం పక్కా అని చెబుతూ కేడర్ లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి కూడా మళ్ళీ సీఎం అవుతానని గట్టిగా చెబుతున్నారు. ఆయన 15 రోజుల లండన్ ట్రిప్ ముగించుకుని గత రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగాడు. ఫ్లైట్ దిగగానే వైసీపీ నేతలంతా ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకు పోటీపడ్డారు. ఇక జూన్ 4 న రాబోయే ఫలితాలపై జగన్ సమీక్షించనున్నారు.
అయితే కేవలం మనం గెలుస్తాము, జూన్ 9 న వైజాగ్ లో జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పడమే కాదు.. చేతల్లో కూడా చూపిస్తున్నారు వైసీపీ నేతలు. అదేనండి వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సభాస్థలిని ఆంధ్ర యూనివర్సిటీలో సిద్ధం చేస్తున్న వీడియోస్ ని వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.
మరి మాటల్లోనే కాకుండా.. వైసీపీ చేతల్లోనూ తామే గెలుస్తామని చూపిస్తున్న కాన్ఫిడెంట్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఫలితాలు వెలువడకముందే జూన్ 9 న ప్రమాణ స్వీకారం అని చెప్పడమే విడ్డూరమంటే. ఇపుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే ప్లేస్ ని రెడీ చెయ్యడం మరీ విడ్డూరం.. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటబ్బా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.