నిన్న శుక్రవారం ముగ్గురు యంగ్ హీరోలు బాక్సాఫీసు దగ్గర పోటీ పడ్డారు, స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసుని, డ్రై గా ఉన్న వేసవి సెలవలని మూడు సినిమాలతో కదిలిద్దామనుకున్నారు. గత వారం రోజులుగా ఆయా సినిమా ప్రమోషన్స్ తో మీడియా హడావిడి చేసింది. విశ్వక్ సేన్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ మూగ్గురు కూడా శక్తిమేర సినిమాలని ప్రమోట్ చేసారు.
ఆడియన్స్ లో కదలిక తెచ్చాము, బాక్సాఫీసు మోత మోగిపోద్ది అనుకున్నారు. కానీ ఈ ముగ్గురు హీరోలు రాంగ్ టైమ్ లో దిగారు అని నిన్న ఆ సినిమా థియేటర్స్ ఆక్యుపెన్సీ చూస్తే తెలుస్తోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, భజే వాయు వేగం, గం గం గణేశా మూడు చిత్రాలకి ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ ముగ్గురు హీరోలు రాంగ్ టైమ్ పోటీ పడ్డారు అందుకే కనీసం సరైన ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నికల ఫలితాల గురించి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది టెన్షన్ లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం నుంచి జూన్ 4 వరకు ఎగ్జిట్ పోల్స్ అంటూ ఛానల్స్ హడావిడి, జూన్ 4 ఫలితాలు.
ఈ మూమెంట్ లో జనాలు థియేటర్స్ కి వెళ్లి రిలాక్స్ అవుతూ సినిమాలు చూసే మూడ్ ఉంటుందా.. అప్పటివరకు ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లే ఛాన్స్ అయితే ఉండదు. అందుకే చాలామంది విశ్వక్, కార్తికేయ, ఆనంద్ లు ముగ్గురు రాంగ్ టైమ్ లో దిగారు.. అంటూ కామెంట్ చేస్తున్నారు.