పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ఫలితాల కోసం వెయిట్ చేస్తూ.. ఫలితాల తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ని కలిసి ఈరోజు శుక్రవారం ఫలితాల తర్వాత కూటమి అధికారంలోకి వస్తే జరపవలసిన పనులపై సమీక్షించబోతున్నారు. మరి ఫలితాల తర్వాత పవన్ ఎప్పుడు షూటింగ్స్ పై దృష్టి పెడతారు అనే విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది.
జూన్ నాలుగు తరువాత ఎప్పుడు షూట్ కు వచ్చేదీ చెబుతాను.. ఏర్పాట్లు చేసుకోమని హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కి పవన్ కళ్యాణ్ సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. హరి హర వీరమల్లు నుంచి దర్శకుడిగా క్రిష్ తప్పుకోగా.. ఏఎం రత్నం తన తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మిగతా షూటింగ్ పూర్తి చెయ్యడానికి డిసైడ్ అయ్యారు.
ఆ మేర షూటింగ్ పూర్తి కాగానే హరిహర వీరమల్లు విడుదలపై ఒక క్లారిటీ ఇస్తారట మేకర్స్. ఇక హరి హర వీరమల్లు షూటింగ్ కదిలితే.. మిగతా OG అలాగే ఉస్తాద్ షూటింగ్ పై కూడా ఓ క్లారిటీ రావడం పక్కానే. సో జూన్ 4 తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్స్ కి ఎప్పుడొస్తారనే దానిపై స్పష్టత వస్తుందన్నమాట.