ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సినిమా సెలబ్రిటీస్, రాజకీయనాయకుల జాతకాలు చెబుతూ తెగ ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పినవి ఒకటో రెండో జరిగేసరికి వేణు స్వామి ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. కొంతమంది ఆయనని పొగుడుతుంటే.. మరికొందరు ఆయన్ని ట్రోల్ కూడా చేస్తూ ఉంటారు.
ఇక వేణు స్వామి హీరోయిన్స్ తో స్పెషల్ పూజలంటూ ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు. గతంలో రష్మిక, డింపుల్ హయ్యతి, నిధి అగర్వాల్, ఇనాయ లాంటి హీరోయిన్స్ వేణు స్వామి చేత స్పెషల్ గా పూజలు చేయించుకున్నవాళ్ళే. హీరోయిన్స్ పూజల్లో వేణు స్వామి బీర్ బాటిల్ పెట్టడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.
పొలిటికల్ గా జాతకాలు చెబుతూ తిట్లు తినే వేణు స్వామి.. హీరోయిన్స్ తో పూజలు చేయించినందుకు ఎంత పారితోషికం తీసుకుంటారనే ప్రశ్నకి నేను హీరోయిన్స్ తో పూజలు చేయించేందుకు ఒక్క పైసా కూడా తీసుకోను, నాకు పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు, దెశ వ్యాప్తంగా నాకు కాస్ట్లీ క్లయింట్స్ ఉన్నారు. అలానే నేను సంపాదించుకుంటాను కానీ హీరోయిన్స్ దగ్గర ఏమి తీసుకోను అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.