విశ్వక్ సేన్-నేహా శెట్టి కాంబోలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నేడు మే 31 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. బాలకృష్ణ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం, బాలయ్య హీరోయిన్ కాంట్రావర్సీలో ఇరుక్కోవడం ఇవన్నీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పై అందరిలో ఆసక్తి పెరిగేలా చేసింది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31 న థియేటర్స్ లో విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ మాస్ పెరఫార్మెన్స్ అదిరినప్పటికి.. అవుట్ డేటెడ్ దర్శకత్వం ఇబ్బంది పెట్టేసింది అంటూ ఈ చిత్రాన్ని వీక్షించిన వారు చెబుతున్నారు. ఇక మొదటి నుంచి ఈ చిత్రం పై ఉన్న అంచనాలు దృష్యా.. ఈ చిత్ర ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. ఈరోజు విడుదలైన ఈ చిత్ర టైటిల్ కార్డ్స్ లోనే ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సో థియేట్రికల్ రన్ అనంతరం ఈ ఇంటెన్స్ డ్రామా ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేసి ఎంజాయ్ చేయవచ్చు.