ఏపీలో ఎన్నికల ఫలితాలు తేలడానికి ఇంకా కేవలం ఐదు రోజుల మాత్రమే సమయం ఉంది. మంగళవారం మధ్యాహన్నానికి ఏపీలో గెలిచేదెవరో.. ఓడేదెవరో.. గెలిచి ప్రభత్వాన్ని ఏర్పాటు చేసేదెవరో? ఓడి ప్రతి పక్షంలో కూర్చునేదెవరో అనేది తేలిపోతుంది. జగన్ vs కూటమి అన్నట్టుగా సాగిన ఏపీ ఎన్నికల్లోప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారా..?
జగన్ ఓట్ బ్యాంకు గెలవబోతుందా? చంద్రబాబు మాస్టర్ మైండ్ గెలవబోతుందా? జగన్ ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మళ్ళి గెలిచి సీఎం అవుతాడా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వైసీపీ నే అని ఎందుకంత ధీమాగా ఉన్నారు. చంద్రబాబు అండ్ కో ఎందుకింత సైలెంట్ గా ఉంది. అసలు ఏపీలో ఏం జరుగుతుంది అంటూ ప్రజలు చాలా ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
జగన్ చెప్పినట్టుగా తాను 2019లో ఇచ్చిన హామీలని జగన్ నెరవేర్చినట్టుగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం వైసీపీ కి ప్లస్ అయ్యిందా, అంతేకాకుండా తన పథకాల వలన ఎవరెంత లాభపడ్డారో అనేది మహిళల్లో, పేదల్లో, పెద్దల్లో స్పష్టత ఉంది. అందుకే జగన్ ని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారంటూ పలు సర్వే లు చెబుతున్నాయి. నిజంగానే జగన్ ఆ సర్వేలని చూసే అంత నమ్మకంతో వైసీపి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అని చెబుతున్నారా?
టీడపీకి పెన్షన్ ఆపించడం మైనస్ అయ్యింది, పెన్షన్ పెంచి ఇస్తామని చంద్రబాబు హామీని ఎవ్వరూ పట్టించుకోలేదనే మాట వినిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం అత్యధిక సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే దానిలో సందేహం ఉన్నప్పటికి.. ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ సీట్లతో జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.