Advertisementt

రామ్ చరణ్ కోసం బుచ్చి బాబు క్రేజీ ప్లాన్

Fri 31st May 2024 03:25 PM
buchi babu  రామ్ చరణ్ కోసం బుచ్చి బాబు క్రేజీ ప్లాన్
Buchi Babu crazy plan for Ram Charan రామ్ చరణ్ కోసం బుచ్చి బాబు క్రేజీ ప్లాన్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో మెగా అభిమానుల ఓపిక నశించిపోతుంది. ఇండియన్ 2 మాదిరి గేమ్ చేంజర్ డేట్ కూడా ఒక్క నెల గ్యాప్ లోనే ప్రకటిస్తారెమో శంకర్ అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అక్టోబర్ అంటూ దిల్ రాజు, రామ్ చరణ్ చెప్పడమే కాని.. ఆ డేట్ లాక్ చేస్తే బావుంటుంది అని అడుగుతున్నారు అభిమానులు .

అదలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి బాబు దర్శకత్వంలో RC 16 మొదలు పెట్టారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి మొదలు కానీ ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం కోసం బుచ్చి బాబు చేసిన ఓ ప్లాన్ వైరల్ గా మారింది.

RC 16 కోసం బుచ్చి బాబు ఓ మెగా విలేజ్ సెట్ వేయించబోతున్నాడట. రంగస్థలం కోసం సుకుమార్ వేయించిన పల్లెటూరి సెట్ కి మించి బుచ్చిబాబు చరణ్ కోసం భారీ సెట్ వేయిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 60 శాతం ఈ సెట్ లోనే ప్లాన్ చేశారట. దీని కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

మరి RC 16 విషయంలో బుచ్చి బాబు ఆలోచనలన్నీ పాన్ ఇండియా లేవల్లోనే కాష్ట్లీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెట్ ముచ్చట కూడా ఆ కాస్ట్లీ ఆలోచనలో భాగంగానే అని తెలుస్తోంది. ఏది ఏమైనా చరణ్ తో బుచ్చిబాబు ఓ భారీ మూవీని తెర పైకి తీసుకురాబోతున్నాడు. 

Buchi Babu crazy plan for Ram Charan:

Buchi Babu Sana Has Big Plans For Ram Charan

Tags:   BUCHI BABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ