Advertisementt

సైలెంట్ గా ఓటీటీలోకి అల్లరోడి సినిమా

Fri 31st May 2024 10:07 AM
aa okkati adakku  సైలెంట్ గా ఓటీటీలోకి అల్లరోడి సినిమా
Aa Okkati Adakku is now streaming సైలెంట్ గా ఓటీటీలోకి అల్లరోడి సినిమా
Advertisement
Ads by CJ

కొంతమంది విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటూ సినిమాలని థియేటర్స్ లోనే కాదు ఓటీటీల లోను విడుదల చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది చడీ చప్పుడు చెయ్యకుండా తమ సినిమాలని థియేటర్స్ లో అలాగే ఓటీటీలలో విడుదల చేసేస్తూ ఉంటారు. తాజాగా అల్లరోడి సినిమా అలానే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసి అందరికి షాకిచ్చింది. 

మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. ఈ చిత్రం కామెడీ అండ్ సోషల్ డ్రామా గా తెరకెక్కి థియేటర్స్ లో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ వారు ఫ్యాన్సీ డీల్ తో ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసారు. 

ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ వారు ఎలాంటి హడావిడి చెయ్యకుండా, ఎలాంటి అనౌన్సమెంట్ లేకుండా సైలెంట్ గా ఆ ఒక్కటి అడక్కు చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చేసారు. ఈరోజు నుంచే అంటే మే 31 శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది. 

Aa Okkati Adakku is now streaming:

Aa Okkati Adakku is now streaming on Amazon Prime Video

Tags:   AA OKKATI ADAKKU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ