స్రవంతి చొక్కారపు ఈపేరు ఇప్పుడు ఏ సినిమా ఈవెంట్ జరిగినా ఆ చుట్టుపక్కల వినిపిస్తూనే ఉంది. బిగ్ బాస్ లో పాల్గొని హెల్త్ రీజన్స్ తో హౌస్ నుంచి బయటికెళ్ళిపోయిన స్రవంతి చొక్కారపు ఇప్పుడు యాంకరింగ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసేందుకు తెగ తాపత్రయ పడుతుంది. అనసూయ, మంజూష లాంటి యాంకర్స్ తప్పుకోవడం, సుమ కనకాల భారీ బడ్జెట్ సినిమాల ఈవెంట్స్ తో బిజీ అవడంతో స్రవంతి టైం స్టార్ట్ అయ్యింది.
శ్రీముఖి కూడా బుల్లితెర పై హవా చూపిస్తూ సినిమా ఈవెంట్స్ కి దూరంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే స్రవంతి చొక్కారపు హైలెట్ అయ్యింది. అది అందంతోనో, లేదంటే లక్కుతోనో కాదు.. గ్లామర్ షో చేస్తూ దూసుకుపోతుంది. హీరోయిన్స్ కి మించి స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత ఉంటుంది. దానితో ఆమెకి అవకాశాలు తన్నుకొస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమా ఈవెంట్ లో చూసినా స్రవంతి చొక్కారపునే కనిపిస్తుంది. ఫుల్ గా గ్లామర్ షో చేస్తుంది. శారీస్ లోను అందాలను చూపించేందుకు ట్రై చేస్తుంది. ప్రస్తుతం ఉన్న యాంకర్స్ అందరికి స్రవంతి హోల్సేల్ గా చెక్ పెట్టినట్టుగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ ఈవెంట్ కి వెళ్లినా స్రవంతినే కనిపిస్తుంది!