సొంతం, జెమిని చిత్రాల తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నమిత.. ఆ తర్వాత తమిళనాట హవా చూపించడంతో, ఆమెకి యూత్ మొత్తం అభిమానులుగా మారిపోయారు. తమిళ తంబీలు ఏకంగా నమితకు గుడి కట్టేసారు. సొంతం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమితకి జెమిని చిత్రం పేరుని తెచ్చిపెట్టింది. తమిళనాట కెరీర్ లో దూసుకుపోతున్న తరుణంలో ఆమె బరువు ఆమె కెరీర్ ని కిందకి పడేసేలా చేసింది.
బొద్దుగా మారడంతో నమితకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో సెకండ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ కి పరిమితమైంది. అవకాశాలు తగ్గడంతో తమిళ బిగ్ బాస్ ద్వారా రీ ఎంట్రీకి ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఆ తరవాత 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు నమిత పూర్తిగా దూరమైంది.
ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇలాంటి సమయంలోనే నమిత ఆమె భర్త వీరేంద్రతో విడిపోతుంది, త్వరలోనే విడాకులు తీసుకుంటుందని ప్రచారం జరగడంతో వెంటనే నమిత విడాకుల రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.
నేను, నా భర్త వీరేంద్ర విడిపోతున్నాం, విడాకులు కూడా తీసుకుంటున్నామని వార్తలు రాస్తున్నారు. ఆ పుకార్లని చూసి నా స్నేహితులు, బంధువులు ఫోన్ చేసి మమ్మల్ని అడిగారు. కానీ నేను కొద్ది రోజుల క్రితమే నా భర్తతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అలాంటి ఫోటో చూసాక కూడా ఇలాంటి నిరాధరమైన వార్తలు ఎందుకు వస్తున్నాయనేది తెలియడం లేదు.
కొన్నిసార్లు మా డివోర్స్ గురించి వార్తలు రావడం చూసి నేను నా భర్త కూడా నవ్వుకున్నాం. అలాగే అలాంటి చీప్ రూమర్స్ చూసి మేము బాధపడడం లేదు అంటూ నమిత విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టింది.