బేబీ తో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకుని ఒక్కసారిగా ఫేమస్ అయిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్యలు మరోసారి కలిసి రొమాన్స్ చెయ్యబోతున్నారు. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి మళ్ళీ కలిసి నటించే ముందుగా వీరు వేర్వేరు చిత్రాలతో వేర్వేరు నటులతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అది కూడా వారం గ్యాప్ లో.
గత వారం బేబీ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ విడుదలైంది. ఆశిష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యని కూడా నిరాశపరిచింది. లవ్ మీ ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.
ఇక బేబీ హీరోయిన్ వైష్ణవి లవ్ మీ విడుదలైన వారం గ్యాప్ లో ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
మరి ఆనంద్ అయినా బేబీ తర్వాత విజయాన్ని చూస్తాడా, లేదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది. ఆనంద్ కూడా గం గం గణేశా ని భారీగా ప్రమోట్ చేసి ఆడియన్స్ ముందు కు వస్తున్నాడు. మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
బేబీ హీరోయిన్ అవుట్.. హీరో పరిస్థితి ఏమిటో అంటూ నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. దానికి మరొక్క రోజు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.