ఆంధ్రలో ఏ రాజకీయ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అని ప్రజలు ఏంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అటు పోటీ చేసిన నేతల్లోనూ టెన్షన్ కనిపిస్తుంది. ఈసారి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. ప్రజలు ఎవరికి సై అంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. మే 13 న పోలింగ్ ముగిసాక ఏపీ నేతలు, ముఖ్యంమత్రి జగన్ అందరూ మళ్లీ వైసీపీ దే గెలుపు అంటూ ధీమాని వ్యక్తం చేసారు.
జూన్ 4 ఫలితాల్లో వైసీపి విజయకేతనం ఎగురవేస్తుంది. జూన్ 9 న జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తారంటూ వైసీపీ నేతలు నమ్మకంగా చెబుతున్నట్టుగానే.. పలు సర్వే లు వైసీపీ కి మొగ్గు చూపుతున్నాయి. తాజాగా నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే కూడా ఆంధ్రలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వైసీపీ పార్టీ నే అని తేల్చేసేసింది. వైస్సార్సీపీ కి 92 అస్సంబ్లీ సీట్లు వస్తాయని.. 22 వరకు పార్లమెంట్ సీట్స్ వస్తాయని..
అదే సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 46 అసంబ్లీ సీట్స్, 3 లోక్ సభ సీట్లు గెలుస్తాయని, 18 సీట్లలో చాలా టైట్ ఫైట్ నడుస్తుంది అని నాగన్న సర్వే చెబుతుంది. 2024 ఎన్నికలలో విజయం జగన్ దే అని తేల్చేసిన నాగన్న సర్వే. పూర్తి మెజారిటీతో వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని ఈ సర్వే ద్వారా స్పష్టమవుతుంది.