పవన్ కళ్యాణ్ తో సాహో దర్శకుడు తెరకెక్కిస్తున్న OG చిత్రాన్ని దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా సూపర్బ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
ఇక పవన్ కళ్యాణ్ OG షూటింగ్ కి బ్రేక్ తీసుకుని రాజకీయాల్లో బిజీ అయ్యారు. మే 13 ఎన్నికలు పూర్తయితే.. పవన్ ఫ్రీ అవుతారు.. జూన్, జులై కల్లా షూటింగ్ కంప్లీట్ చేసేస్తే OG ని అనుకున్న సమయానికే విడుదల చెయ్యొచ్చు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత రిలాక్స్ అవుతున్నారు.
అయితే ఇప్పడు పవన్ కళ్యాణ్ డేట్స్ ప్రోబ్లం రావడంతో OG ని వాయిదా వేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే నిర్మాత నాగవంశీ OG మేకర్స్ దగ్గర క్లారిటీ తీసుకున్నాకే ఆయన నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ ని సెప్టెంబర్ 27 న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా నాగ వంశి పవన్ కళ్యాణ్ గారు రావడం లేదు కాబట్టే మేము సెప్టెంబర్ 27 న వస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ OG వాయిదా పడినట్లే. ఆ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.