జూనియర్ ఎన్టీఆర్ కి సలహాలు ఎక్కువయ్యాయి. ఎలక్షన్ కి ముందు టీడీపీ vs ఎన్టీఆర్ ఉండాల్సిది, ఎలక్షన్ పూర్తయ్యాక రిజల్ట్ కోసం వేచి చూసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి లాగి కొంతమంది టీడీపీ సానుభూతిపరులు ఎన్టీఆర్ ని ఇష్టమొచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు కూడా టీడీపీ సానుభూతిపరులకి ఇచ్చి పడేస్తున్నారు. కొద్దిరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ vs టీడీపీ సానుభూతిపరులు మద్యన పెద్ద ఫైట్ జరుగుతుంది.
అంతేకాదు ఎన్టీఆర్ కి సలహాలు ఇచ్చేవారు కూడా ఎక్కువయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి సలహాలిస్తూ ఒకాయన పెట్టిన పోస్ట్ మీ కోసం..
రావాలి అనుకుంటే వస్తాడు.. వస్తే ఎవరు ఆపలేరు.. అపరు కూడా.. @tarak9999. ఒక్క ప్రెస్మీట్తో తెరదించే దానికి మీ అమ్మని.. నందమూరి కుటుంబం సభ్యుల అడబిడ్డల ని రోడ్ మీదకి నీ ఆటో యూనియన్ ఫ్యాన్స్ తెస్తున్నారు.. ఆలోచించుకో.. అంత నెగిటివిటీ తో ఎంతకాలం సాగదిస్తావ్.. ఏదొక రోజు బయటపడాల్సిందే.. పార్టీ ఆఫీస్ కి తాళం వేసేసి.. తాళం గుత్తి చేతిలో పెట్టేయరు.. నువ్వొకడివే వారసుడు కాదు.. ఇదేమి రాచరికరం కూడా కాదు.. ప్రత్యర్థి ఎదురుగా వెళ్తే కన్నా తల్లి శీలాన్ని నిండు శాసనసభ లో బరితెగించి కారు కూతలు కూసి అల్లరి చేశారు.. నీ వరకు వస్తే నీవు ఇవి అసలు తట్టుకోలేవ్.. అన్ని తెలిసిన వాడీవే.. తెలివైన వాడివే..
నీ రాక తెలుగుదేశం సానుభూతి పరులకు అందరికి ఇష్టమే.. నువ్వోస్తే.. నిన్ను నీ పుట్టుకని నీచంగా తిట్టేది ఇప్పుడు నీకు వంతపాడుతున్న ఇదే ముసుగు కుక్కలు.. జరబద్రం తారక్.. నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది..
నువ్వు రెండు వైపులా తీసుకుంటే నీ మూవీ రెండు వైపులా చూసేస్తారు అనే అభూత కల్పన నుంచి బయటికి వచ్చి ఒక వైపు తీసుకుని చూడు అది.. సింహాద్రి రోజులు చూస్తావ్.. లేదు నీ ఇష్టం.. ఇలాగే తిట్టించుకో.. నీ కుటుంబ సభ్యులని నీ ఆటో యూనియన్ బ్యాచ్ తో తిట్టించుకో.. నీ కర్మ.. అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.