హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేయలేకపోయినా.. వరస సినిమాల్లో కనిపిస్తున్న నివేదా పేతురేజ్ తాజాగా పోలీసులతో గొడవపడుతూ.. కనిపించిన వీడియో వైరల్ గా మారింది. నివేదా పేతురాజ్ ప్రయాణిస్తున్న కారుని ఆపి చెక్ చెయ్యాలని పోలీసులు అడగగా.. దానికి నివేద పేతురేజ్ కుదరదు, ఇది పరువుకు సంబందించినది అంటూ బ్రతిమాలుకుంది.
కావాలంటే కారుకు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని అవి చెక్ చేసుకోండి, కారు డిక్కీ మాత్రం ఓపెన్ చేయనని చెప్పడంతో.. పోలీసులు తమకు సహకరించాలని.. మీరు కూడా ఈవిధంగా మొండికేస్తే ఎలా అని అనడంతో నివేదా కాస్త కంగారు పడింది. పోలీసులు నివేదా కారు డిక్కీ ఓపెన్ చేయమంటే.. ఆమె ఓపెన్ చేయకుండా అది తమ ఫ్యామిలీ పరువుకు సంబంధించినది అని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.
అయినా కుదరదు కారుని సోదా చెయ్యాల్సిందే అని పోలీసులు అడగగా.. పోలీస్ లపై నివేదా పేతురాజ్ ఫైర్ అవడమే కాదు.. ఆ గొడవని వీడియో తీస్తున్న వారి కెమెరాని నెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు నివేదా పేతురాజ్ కారు ఎందుకు చెక్ చేయాలన్నారు?
అసలు నివేదా కారులో ఏం తరలిస్తోంది. ఎందుకు పరువు అదీ ఇదీ అంటూ పెద్ద మాటలు మాట్లాడింది, నివేదా పేతురేజ్ ఏమి దాస్తోంది అంటూ మీడియాలో ఆ వీడియో పై రకరకాలుగా చర్చలు మొదలైపోయాయి.