ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్.. ఆ చిత్రం కన్నా ముందె కోలీవుడ్ డైరెక్టర్ శంకర్-దిల్ రాజు కాంబోలో గేమ్ చేంజర్ మొదలు పెట్టారు. ఆ చిత్రం గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అక్టోబర్ లో గేమ్ చేంజర్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా టీం చెబుతూ వస్తుంది.
ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు దర్శకత్వంలో RC 16 అలాగే సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వచ్చిన క్రేజ్ తో రామ్ చరణ్ ఇప్పుడు RC 16 కోసం భారీగా పారితోషికాన్ని పెంచేశారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గేమ్ చేంజర్ కి రామ్ చరణ్ 90 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారని, అదే బుచ్చి బాబు చిత్రం కోసం రామ్ చరణ్ ఏకంగా 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అయ్యింది. మరి ఇది నిజమైతే టాలీవుడ్ లో టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల్లో చరణ్ ముందుంటారు.