కత్తి మహేశ్.. ఈ పేరు, మనిషి గుర్తున్నాడు కదా..! అవును వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. వివాదాలనే డ్రెస్‌గా వేసుకుని తిరిగే మనిషి.. నిత్యం వివాదాలే ఊపిరిగా బతికిన మనిషి.. ఎప్పుడు చూసినా ఎవరిని తిడదాం.. ఎలా వార్తల్లో నిలుద్దాం.. హాట్ టాపిక్ అవుదాం అనుకునే వ్యక్తి.. గుర్తు ఉన్నారనుకోండి! ఇప్పుడేంటి.. ఆయన చనిపోయారు కదా ఇప్పుడెందుకు ఆ టాపిక్ అని అనుకుంటున్నారు కదా..! నిజమే కాదనట్లేదు. ఇప్పుడు సరిగ్గా ఒక వ్యక్తి అలానే తయారయ్యాడు.. అచ్చు గుద్దినట్లుగా ప్రవర్తన అంతా కత్తినే..!
ఇదీ కత్తి కథ..!
నిద్ర లేచింది.. తిరిగి నిద్రపోయే వరకూ కత్తి మహేష్ తానొక జర్నలిస్టు అని, రాజకీయ విశ్లేషకుడిని, ఫిల్మీ.. పొలిటికల్ క్రిటిక్ అని.. దేశంలో ఏం జరిగినా సరే అంతా తనకే తెలుసని.. ఒక వర్గాన్ని, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వచ్చిన మనిషి కత్తి మహేష్. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రోజూ ఆడి పోసుకుంటూ అటు సినిమా పరంగా.. ఓటు రాజకీయాల పరంగా నోటికి ఎంతొస్తే అంతలా హద్దూ పద్దూ లేకుండా మాట్లాడిన మనిషి. అంతకు డబుల్ జనసేన కార్యకర్తలు, అభిమానులు.. మెగాభిమానులతో లెక్కలేనన్ని సార్లు, చెప్పుకోలేని విధంగా దెబ్బలు తిన్న మనిషి. ఇక పార్టీ పరంగా అంటారా..? వైసీపీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి.. పార్టీపైన, నేతలపైన ఈగ కూడా వాలినా అస్సలు ఒప్పుకునే మనిషి కాదు. ఇటు మద్దతు.. అటు వ్యతిరేకంగా మాట్లాడి.. మాట్లాడి.. వైసీపీ తొత్తుగా పేరు తెచ్చుకున్నాడు. ఒకానొక సమయంలో తెలుగు మీడియా ఇతడిని ఒక ఐటెం రాజాగా తెగ వాడేసింది. అలా బతికిన ఈయన తన స్వగ్రామం చిత్తూరు జిల్లా యలమందకు వెళ్తుండగా ఘోర రోడ్డుప్రమాదం జరగడం.. కొద్ది రోజులపాటు చావుతో కొట్టుమిట్టాడి కన్నుమూశాడు. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు, చికిత్స.. సర్జరీలకు కావాల్సిన సుమారు ఐదు కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అయినా కత్తి ప్రాణం దక్కలేదు. ఇదీ కత్తి బాగోతం.
అవునా.. నిజమా?
చూశారుగా.. ఇప్పుడు ఇలాగే ఒక నటుడు కమ్ పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ కిర్రాక్ ఆర్పీ తయారయ్యాడు అని చర్చించికుంటున్నారు. అప్పట్లో ఆయన.. ఇప్పుడు ఈయన అంటూ సోషల్ మీడియాలో తెగ తిట్టి పోస్తున్నారు. నెల్లూరు జిల్లా వాసి అయిన ఆర్పీ ఏపీ ఎన్నికల ముందు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరగా ఇతను కూడా పసుపు కండువా కప్పుకున్నాడు. ఇక చేపల పులుసు బిజినెస్ పెద్దగా జరగట్లేదు ఏమో కానీ పూర్తిగా దాన్ని పక్కనెట్టి రాజకీయాల్లోనే తిరిగాడు. ఎన్నికల ప్రచారం మొదలుకుని ఇప్పటి వరకూ ఏదో ఒక చోట.. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లో కనిపిస్తూ ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పుకుంటూ వైసీపీని ఇష్టం వచ్చినట్లు తిడుతూ.. ఆ పార్టీ కార్యకర్తలు మొదలుకుని, వైఎస్ జగన్ రెడ్డిని.. విజయసాయి రెడ్డిని ఏ ఒక్కరినీ వదలకుండా పచ్చి బూతులు.. అరే, ఒరే.. కొడకా అని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎంతలా అంటే ఒకటి రెండు ప్రధాన ఛానెళ్లు కూర్చోబెట్టి డిబేట్లు, స్పెషల్ బులిటెన్ నడిపించిన పరిస్థితి. నాడు కత్తి మహేష్.. నేడు ఆర్పీ అన్నట్లుగా తెగ హడావుడి చేస్తున్నాయి. ఇక వైసీపీకి ఎవరైనా అనుకూలంగా మాట్లాడినా సరే అబ్బో ఒంటి కాలిమీద ఎగురుతున్నాడు. అంతేకాదు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామిని ఐతే పచ్చి బూతులు.. అది నోరా తాటి మట్టా అనే డౌట్ వచ్చేలా తిట్టిన పరిస్థితి.. ఆఖరికి ఆయన పురోహిత్యాన్ని, కులాన్ని.. పుట్టుకను కూడా తప్పుబట్టిన మనిషి ఆర్పీ. ఇప్పుడు అటు మీడియా.. సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ అవుతున్నాడు ఆర్పీ.
ఏం ఖర్మరా బాబు..!
ఎప్పుడెప్పుడు ఎన్నికలు ఫలితాలు వస్తాయా ఆర్పీని పట్టుకుందామా..? పులుసు కారేలా కొట్టాలా అని వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు వేచి చూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక కొందరు ఐతే పైత్యం ప్రదర్శిస్తూ ఆర్పీ భార్య, తల్లితండ్రులను టార్గెట్ చేస్తున్నారు. నాడు కత్తి మహేష్ పరిస్థితి కూడా ఇంతకు మించే ఉండేది. వైసీపీ వకల్తా పుచ్చుకున్న ఈయన్ను కనీసం ఒక్కరంటే ఒక్కరూ దెబ్బల నుంచి కానీ.. టార్గెట్ నుంచి కానీ కాపాడలేదు.. కనీసం ఇసుమంత అయినా పట్టించుకోలేదు.. ఏదో అలా చనిపోతున్న పరిస్థితుల్లో అలా ఏదో కాస్త ఖర్చుపెట్టీ చేతులు దులుపుకొంది.. అన్ని రోజులు వైసీపీకి వత్తాసు పలికిన ఆయనకు ఏమైనా దక్కిందా..? కనీసం చనిపోయిన తర్వాత ఐనా ఏమైనా ఒరిగిందా అంటే అబ్బే జీరోనే. ఇప్పుడు ఈయన కూడా తాను ఓవర్ నైట్ సెలబ్రిటీ అని ఫీల్ అవ్వొచ్చు.. టీడీపీ కోసం మాట్లాడి, పొట్లాడితే ఏదో వస్తుందని అనుకొని ఉండొచ్చు కానీ పైసా ప్రయోజనం ఏమైనా ఉంటుందా.. దీనికి అదనంగా అందరి నోళ్లలో నానడం, పచ్చి బూతులు తిట్టించుకోవడం చూస్తే సదరు మనిషికే ఏం ఖర్మరా బాబు అని అంటున్న పరిస్థితి. నాడు కత్తిని.. నేడు ఆర్పీని మీడియా కూడా ఒక ఐటెంలా మాత్రమే వాడుకుంటున్నది. రేపు పొద్దున్నే కష్టం వచ్చినా.. ఎవరైనా టార్గెట్ చేసి కొట్టినా కనీసం ఇదే మీడియా, పార్టీలు ఒక్కరైనా ముఖం ఐనా చూస్తారా..? అస్సలు చూడరు గాక చూడరు.. ఇంకాస్త మసాలా దట్టించి వార్తలు రాస్తారే తప్ప పట్టించుకోరు. అర్థం అయ్యింది కదా.. కష్టపడి పని చేసి నాలుగు రూపాయలు సంపాదించుంటే తప్ప ఇలా నోరు పడేసుకుంటే వచ్చేది ఏంటి.. తెలుసుకుని మసులుకుంటే మంచిది సుమీ..!