Advertisementt

అసలోడు-కొసరోడు అంటూ ఎన్టీఆర్ ని..

Wed 29th May 2024 04:29 PM
jr ntr  అసలోడు-కొసరోడు అంటూ ఎన్టీఆర్ ని..
They are teasing NTR as Asalodu-Kosarodu అసలోడు-కొసరోడు అంటూ ఎన్టీఆర్ ని..
Advertisement
Ads by CJ

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలని పూర్తిగా దూరం పెట్టేసారు. టీడీపీ తో తనకెలాంటి సంబంధం లేదు అన్నట్టుగా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారు. తన సినిమా షూటింగ్స్ ఏవో తాను చేసుకుంటూ ఫ్యామిలీతో కలిసి గడుపుతున్న ఎన్టీఆర్ ని ఎక్కడైనా చూస్తే ఆయన అభిమానులు సీఎం సీఎం అంటూ రెచ్చగొట్టే కేకలు వేస్తూ ఉంటారు. దానితో టీడీపీ అభిమానులు కుళ్ళుకుంటున్నారు.

ఆ సందర్భంలోనే ఎన్టీఆర్ పై కామెంట్ చేసి ఎన్టీఆర్ అభిమానులకి టార్గెట్ మారుతున్నారు. మొన్న బుద్ధా వెంకన్న ఎన్టీఆర్ కి టీడీపీ కి సంబంధం లేదు అన్నాడు. దానితో బుద్ధా వెంకన్న కి, టీడీపీ అభిమానులకి ఎన్టీఆర్ ఫాన్స్ ఆల్మోస్ట్ చుక్కలు చూపించారు. ఇక రమ్య పరచూరి అనే టీడీపీ అభిమానినైతే నానా రకాలుగా ట్రోల్ చేసారు.

సరే ఎన్టీఆర్ ఫాన్స్ ని కెలకడమెందుకు తిట్లు తినడమెందుకు అని అందరూ సలహాలు ఇస్తున్న సమయంలో నిన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ ని సీఎం సీఎం అంటూ చేసిన నినాదాలతో ఆ రమ్య పరచూరి మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. మళ్ళి రెచ్చిపోయారు.

ఇక ఇప్పుడు మరోసారి రమ్య పరచూరి.. నిన్న బాలయ్య మోక్షజ్ఞ పై ఓ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ చూసి అంతేకదా మరి!! అసలోడు దిగేవరకూ, కొసరోడికి పండగే.. ఈ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చే రోజు కోసం ప్రతి Nandamuri వంశాభిమాని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు, మీరు మొదలెట్టండి బాలయ్య ❤️❤️ అంటూ చేసిన ట్వీట్ మరోసారి చర్చకి దారి తీసింది.

అంటే అసలోడు మోక్షజ్ఞ,  కొసరోడు ఎన్టీఆర్ అనా నీ ఉద్దేశ్యం.. మోక్షజ్ఞకి అంత సీన్ లేదు అసలోడు ఎన్టీఆర్, కొసరోడే మోక్షజ్ఞ అంటూ ఎన్టీఆర్ అభిమానులు మళ్ళీ మళ్ళీ రెచ్చిపోయి రమ్య పరచూరిని ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేసారు. 

They are teasing NTR as Asalodu-Kosarodu:

Ramya Paruchuri indirect comments on Jr NTR

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ