జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైసీపీ టచ్‌లోకి వెళ్లిందా..? కొందరు ముఖ్యనేతలు.. సేనానితో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా అపాయిట్మెంట్ కోసమే వేచి చూస్తున్నారా..? అంటే ఇవన్నీ చాలా అతిగా ఉన్నాయి కదా. అయితే.. జనసేన మాత్రం ఇవన్నీ అక్షరాలా నిజమేనని చెప్పుకుంటోంది. అదెలాగంటే.. జనసేనకు చెందిన పొలిటికల్ మిస్సైల్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో ఇవన్నీ రాసుకొస్తుండటం గమనార్హం. వాస్తవానికి జనసేన తరఫున ఈ అకౌంట్ చాలా యాక్టివ్ ఉంటుంది. అయితే.. సడన్‌గా ఇలా ట్వీట్ రావడంతో అసలేం జరుగుతోందని అటు జనసేన.. ఇటు వైసీపీ కార్యకర్తలు ఆలోచనలో పడ్డారట.
బాబోయ్.. నిజమేనా?
21 అసెంబ్లీ, 02 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసిన జనసేన తక్కువలో తక్కువ 12 ఎమ్మెల్యే, 02 ఎంపీలు గెలిచే అవకాశాలు గట్టిగానే ఉన్నాయన్నది బయట నడుస్తున్న టాక్. ఒకవేళ తక్కువ సీట్లు వచ్చి మేజిక్ ఫిగర్ దగ్గరగానే వైసీపీ ఆగిపోతే.. బ్యాకప్ కోసం పవన్ ఉంటే బాగుంటుందని అందుకే ఇలా టచ్‌లోకి వెళ్లారన్నది ఓ వర్గం చెబుతున్న మాట. అయితే.. ఇప్పటికే రష్యాలో ఉన్న పవన్‌తో ఒకరిద్దరు వైసీపీ పెద్ద తలకాయలు మాట్లాడరని అన్నీ సవ్యంగా జరుగుతాయని నమ్ముతున్నారట. మరోవైపు.. వైసీపీ యత్నించినా అబ్బే అస్సలు గబ్బర్ సింగ్ ఒప్పుకోలేదట. ఇందులో నిజానిజాలెంత అనేది జనసేనకే తెలియాలి మరి.
ఇంత పైత్యమా..?
పొలిటికల్ మిస్సైల్ అనేది పేరుగాంచిన ట్విట్టర్ పేజీ. అయితే.. సడన్‌గా ఇలా పుకార్లు సృష్టించడంతో వైసీపీ కార్యకర్తలు ఓ రేంజిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవర్ని పట్టుకుని ఏం మాట్లాడుతున్నార్రా బాబూ..? అదే పరిస్థితి వస్తే అధికారాన్ని వదులుకునే వ్యక్తే గానీ జగన్ ఎవరి దగ్గారా చేయి చాపే ప్రసక్తే లేదని తిట్టిపోస్తున్నారు. ఈ పేజీ అడ్మిన్ ఎవరో త్వరగా ఎర్రగడ్డకు తరలించడ్రా నాయనా అంటూ మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయితే.. ఏమో గుర్రం ఎగురావచ్చు ఇదే పరిస్థితి రానూ వచ్చు.. జర ఆగితే జూన్-04న తేలిపోతుంది కదా అని జనసైనికులు కొందరు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. చూశారుగా.. జనసేన పైత్యం, వైసీపీ అతి ఎలా ఉందో.. ఏం జరుగుతుందో చూడాలి మరి.