Advertisementt

బాలయ్యని ట్రోల్ చేస్తున్న వైసీపీ

Wed 29th May 2024 11:32 AM
balakrishna  బాలయ్యని ట్రోల్ చేస్తున్న వైసీపీ
YCP is trolling Balayya బాలయ్యని ట్రోల్ చేస్తున్న వైసీపీ
Advertisement
Ads by CJ

ఎన్నికలైపోయినా వైసీపీ పగ తీరినట్టుగా లేదు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారికి బాలయ్య తప్పు చేసాడని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. బాలకృష్ణ చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన ఎవ్వరితోనయినా ఇట్టే కలిసిపోతారు. సరదాగా ఉంటారు. అలానే గత రాత్రి విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య విశ్వక్ సేన్ ఫోన్ సరదాగా విసురతాని బెదిరించడమే కాదు.. విశ్వక్ నాకు రక్తం పంచుకుని పుట్టకపోయినా మేమిద్దరం కవలల పిల్లల టైప్ అంటూ కామెడీగా చెప్పారు. 

ఆ తర్వాత స్టేజ్ పై హీరోయిన్స్ తో సరదాగా మాట్లాడారు. నారి నారి నడుమమురారి అంటూ నేహా శెట్టి కత్తి, అంజలి ఖతర్నాక్ అంటూ ఫన్నీగా మాట్లాడిన బాలయ్య అంజలిని సరదాగా మట్లాడుతూ తోసేసిన వీడియో ని వైసీపీ సోషల్ మీడియా తెగ ట్రెండ్ చెయ్యడమే కాదు.. బాలయ్య తాగేసి ఈవెంట్ కి వచ్చాడంటూ ప్రచారం చేస్తుంది. 

మహిళల పట్ల టీడీపీ నేత బాలకృష్ణ మరోసారి అసభ్య ప్రవర్తన! ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మద్యం తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వైనం!  మహిళలంటే మీకు అంత చులకనా, మాన్షన్ హౌస్ బాలయ్య 🍺 సినిమా ఫంక్షన్ లో తాగి హీరోయిన్ ను తోసిన బాలయ్య💦 మళ్ళీ వీళ్ళే విలువలు, సాంప్రదాయం గల కుటుంబాలు అంటూ బిల్డప్ కొడతారు అంటూ ఆ వీడియో ని వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 

YCP is trolling Balayya:

Balakrishna Fun With Anjali at Gangs Of Godavari Pre Release Event

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ