Advertisementt

మూడుముక్కలాటలో గెలుపెవరిదో..

Wed 29th May 2024 10:25 AM
gangs of godavari  మూడుముక్కలాటలో గెలుపెవరిదో..
Vishwak Sen vs Kartikeya vs Anand Devarakonda మూడుముక్కలాటలో గెలుపెవరిదో..
Advertisement
Ads by CJ

రేపు శుక్రవారం థియేటర్స్ లో మూడుముక్కలాట చూడబోతున్నారు. మే 31 న థియేటర్స్ లో విశ్వక్ సేన్, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ తమ తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. ముగ్గురు ముగ్గురే అన్నట్టుగా ప్రమోషన్స్ తోనూ పోటీ పడుతున్నారు. విశ్వక్ సేన్ నందమూరి బాలకృష్ణ ని తీసుకొచ్చి తన సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

ఇక ఆనంద్ దేవరకొండ అయితే నేషనల్ క్రష్ రశ్మికతో స్టేజ్ పై డాన్స్ చేస్తూ తన సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు. ఇక కార్తికేయ తన సినిమా కోసం మరో యంగ్ హీరో శర్వానంద్ ని హెల్ప్ కోరాడు. ఈ శుక్రవారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా, భజే వాయు వేగం అంటూ మూడు సినిమాలు బాక్సాఫీసు వేటకి బయలుదేరాయి.

ముగ్గురు హీరోలు మూడుముక్కలాటలో గెలుపెవరిదో అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో విశ్వక్ హిట్ కొడతాడా? గం గం గణేశా తో ఆనంద్ దేవరకొండ సక్సెస్ సాధిస్తాడా? భజే వాయువేగంతో కార్తికేయ విజయాన్ని అందుకుంటాడా అనేది ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.  

Vishwak Sen vs Kartikeya vs Anand Devarakonda:

Gangs Of Godavari vs Bhaje Vayu vegam vs Gam Gam Ganesha

Tags:   GANGS OF GODAVARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ