తామెక్కడ ఓడిపోతామో అనే అసహనంలో వైసీపీ నేతలు ప్రెస్ మీట్స్ లో కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామేమో అని.. ఎన్నికలు సజావుగా జరగలేదు, పారదర్శకముగా జరగలేదు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈరోజు సజ్జల అయితే టీడీపీ కి ఎన్నికలు ఎలా జరిగినా వారికి ఒక ధీమా ఉంది. కానీ పోలింగ్ సరిగ్గా జరగలేదు, మేము రీ పోలింగ్ అడుగుతున్నా టీడీపీ మాత్రం ఎందుకంత ధీమాగా ఉంది అంటూ మాట్లాడడం..
పేర్ని నాని అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి, మంచి వాతావరణంలో జరగాలి.. ఎలాంటి అల్లర్లు జరక్కుండా చూసుకోవాలని చెప్పడం చూస్తే వైసీపీ వాళ్ళు పోలింగ్ రోజున గొడవలు సృష్టించినట్టుగా కౌంటింగ్ రోజు కూడా గొడవ చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా పేర్ని నాని ముందే హింట్ ఇచ్చాడా అనేలా ఉన్నాయా మాటలు.
అసలు వైసీపీ ఓడిపోతుంది.. ఇదంతా మా తప్పు కాదు, మేము 100 శాతం గెలిచేవాళ్ళం, కానీ బిజెపితో దోస్తీ పెట్టుకుని టీడీపీ వాళ్ళు వ్యవస్థల్ని మ్యానేజ్ చేసారు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. మేము ప్రతి పక్షం పాత్ర పోషించాము, చంద్రబాబు ఎంత ఘటికుడుకాకపోతే మోడీ అంతటివాడిని రోడ్డు మీదకి తీసుకొస్తాడు అంటూ సజ్జల మాట్లాడం చూస్తే వైసీపీ ఓడిపోవడం పక్కా.. అందుకు కారణం మోడీ-చంద్రబాబు మైత్రి. వ్యవస్థని మ్యానేజ్ చేస్తూ గెలిచేశారని చెప్పడానికే ఈ రాగాలు అన్నట్టుగా ఉంది.