Advertisementt

కేసీఆర్ ఆనవాళ్లు అస్సలు ఉండొద్దా..?

Wed 29th May 2024 09:31 AM
cm revanth reddy  కేసీఆర్ ఆనవాళ్లు అస్సలు ఉండొద్దా..?
KCR should not be at all..? కేసీఆర్ ఆనవాళ్లు అస్సలు ఉండొద్దా..?
Advertisement

తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు అస్సలు ఉండటానికి వీల్లేదా..? ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన గులాబీ బాస్‌.. బీఆర్ఎస్ పార్టీనే కాదు, ఆయన ముద్ర అనేదే లేకుండా చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారా..? అంటే తాజా  పరిణామాలను బట్టిచూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కా ప్లాన్‌తో ఒక్కసారి పార్టీ వస్తే ఇక తిరుగు ఉండొద్దన్న టార్గెట్‌తో రేవంత్ ముందుకెళ్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అందుకే మొదట బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి.. కేసీఆర్ కూసాలు కదిల్చిన సీఎం.. ఇప్పుడిక ఆనవాళ్లు అడ్రస్ లేకుండా చేసే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది.

సారొద్దా.. అస్సలే వద్దా..?

తెలంగాణ జాతిపిత కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన బాపు అని బీఆర్ఎస్ చెప్పుకుంటూ ఉంటుంది. చావు నోట్లో తలకాయ పెట్టొచ్చినా అంటూ చెప్పుకున్న ఆయనకు.. రెండు సార్లు అధికారం కట్టబెట్టారు రాష్ట్ర  ప్రజలు. అయితే హ్యాట్రిక్ కొడదామనుకున్న తర్వాత అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక ఆ సంగతి అటుంచితే.. తెలంగాణ ఏర్పాడ్డాక తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం, కొత్త చిహ్నం.. టీఎస్‌ను కాస్త టీజీగా మార్పు.. ఇలా ఒకటా రెండా కేసీఆర్ హయాంలో జరిగిన ఏ ఒక్కటీ ఉండొద్దుని మార్పులు, చేర్పులు చేసేయాల్సిందేనని రేవంత్ గట్టిగానే కంకణం కట్టుకున్నట్లున్నారు. అందుకే.. తొలుత తెలంగాణ విగ్రహం సర్లేదని దొరసానిలా ఉందని గతంలో చెప్పి అధికారంలోకి రాగానే మరో విగ్రహాన్ని తయారు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే.. తుదిరూపు ఖరారు కానుంది.

ఎక్కడా తగ్గేదేలే..!

ఇక రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం వెల్లివిరిసేలా 40కి డిజైన్లు రూపొందించడం జరిగింది. ఒకటి, రెండు రోజుల్లో ఏదో ఒకటి ఫైనల్ కానుంది. నిజామాబాద్‌కు చెందిన చిత్రకారుడు రుద్ర రాజేశ్ అనే వ్యక్తి చిహ్నం సంగతి చూస్తున్నారు. ఇక తెలంగాణ గీతం కూడా మార్చేస్తున్నారు. జయ జయహే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా స్వరకల్పన చేయనున్నారు. ఈ పాటను అందెశ్రీ రాశారు. టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే ఆంధ్రా వ్యక్తితో చేయించడమేంటి..? మనకెవరూ లేరా..? అని ప్రతిపక్షాలు, తెలంగాణ మూవీ అసోసియేషన్లు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాయి. అయితే.. ఇదంతా తనకేం సంబంధం లేదని పాటను అందెశ్రీ.. లోగోను రుద్రరాజు చూసుకుంటారని రేవంత్ చెప్పేశారు. ఇదే కాదు.. టీఎస్ నుంచి టీజీగా, తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ అని కీర్తింస్తుండటంతో జయశంకర్ పేరు తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇలా ఒక్కటా రెండా ప్రతిదీ కేసీఆర్ ముద్ర అనేది ఎక్కడా ఉందొద్దన్నేది టార్గెట్‌గా రేవంత్ పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.. మున్ముందు ఇంకా ఎన్నెన్ని మార్పులు ఉంటాయో చూడాలి మరి.

KCR should not be at all..?:

CM Revanth Reddy targeted BRS party

Tags:   CM REVANTH REDDY
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement