నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రస్తుతం ఉత్కంఠ నడుస్తుంది. బాలకృష్ణ కొడుకుని ఎప్పుడెప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారో అని నందమూరి అభిమానులు చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. మరా తరుణం త్వరలోనే రాబోతుంది అని ఎదురు చూస్తున్న సమయంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఈరోజు మంగళవారం హైదరాబాద్ లో జరిగిన యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అథిదిగా వచ్చిన బాలయ్య ఫన్నీగా మాట్లాడమే కాదు.. విశ్వక్ సేన్ తాను పక్కపక్కన ఉంటే కావల పిల్లలు అంటారు బయట అంటూ మాట్లాడిన విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్దూ జొన్నలగడ్డ నా గ్యాంగ్ అంటూ నా కొడుక్కి మీ ముగ్గురే ఇన్స్పిరేషన్ అని చెబుతాను.
మా వాడు ఉన్నాడు మోక్షు.. రేపు ఇండస్ట్రీకి రావాల్సిన వాడు. మావాడు వస్తున్నాడు ఇండీస్ట్రీ కి .. నేను కాదు, నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవద్దు. వాడికి మీ ముగ్గురే ఇన్స్పిరేషన్ అంటూ బాలయ్య విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డలు స్వశక్తిగా పైకొచ్చి హీరోలుగా ఎదిగిన విషయాన్ని బాలయ్య కొడుక్కి కూడా నేర్పించాలని, ఓ వారసుడిగా కాకుండా కష్టాన్ని నమ్ముకోవాలని బాలయ్య చెప్పాలనుకున్నారు.