ప్రస్తుతం హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణలోని పలు సిటీస్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక రెస్టారెంట్స్, హోటల్స్, ధాబాలపై రైడ్స్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద పేరున్న రెస్టారెంట్స్ ముసుగులో కల్తీ ఫుడ్ మాత్రమే కాకుండా.. నిల్వ ఉన్న ఆహారపదార్ధాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసారు. అంతేకాకుండా అన్ని రకాల గ్రాసరీస్ ఇంటికే డెలివరీ చేస్తామంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పాలిట అదృష్టంలా తయారైన బిగ్ బాస్కెట్ లో కూడా కాలం చెల్లిన సరుకులు ఫుడ్ సేఫ్టీ అధికారుల కంటపడ్డాయి. దానితో బిగ్ బాస్కెట్ కి మూడింది.
పేరున్న హోటల్స్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలని కష్టమర్లకి వడ్డించడం, ఫ్రిజ్ లో పెట్టి కుళ్లిపోయిన వాటితో ఫ్రెష్ గా ఫుడ్ తయారు చెయ్యడం, కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడం ఇవన్నీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ గా తీసుకుని పలు హోటల్స్ పై రైడ్స్ చేస్తున్నారు. రామేశ్వరం కేఫె లాంటి పెద్ద పేరున్న హోటల్ పై దాడి చెయ్యగా అక్కడ ఎక్సపైరీ అయిన వస్తువులు దొరకడం అందరిని విస్మయానికి గురి చేసింది.
గత వారం రోజులుగా హైదరాబాద్ అలాగే ఖమ్మం, సూర్యాపేట లాంటి పట్టణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో ఎన్నో రెస్టారెంట్స్ యజమానులు పట్తుబడ్డారు. ఇదంతా సోషల్ మీడియా, ఛానల్స్ లో వస్తూనే ఉంది. అది చూసి షాకవుతున్న కష్టమర్లు.. ఇంకెప్పుడూ హోటల్ ఫుడ్ తినకూడదు, తినడానికి కూడా ఆలోచించేలా ఉన్నాయి ఈ దాడులు.
ఇంతజరిగినా చాలామందిలో ఎలాంటి మార్పు లేదు. ఈ శనిఆదివారాల్లో ఏ రెస్టారెంట్ దగ్గర చూసిన జనాలే. కిటకిట లాడుతూ వెయిటింగ్ చేస్తూ ఆహారం కోసం కూర్చున్న వాళ్లే. హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్స్ దగ్గర అనేకమంది ఫ్యామిలీస్ తో కనిపించడం చూసిన వారంతా.. ఇంత జరుగుతున్నా వీరిలో ఏ మార్పు లేదు. అందుకే ఆ రెస్టారెంట్స్ వారు అంతలా రెచ్చిపోతున్నారు.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
రీసెంట్ గా జీడిమెట్లలో మండి రెస్టారెంట్ లో ఓ జంట పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకుందామని కుటుంబ సభ్యులతో వెళ్లి బిర్యానీ తిని 1000 బిల్లు చెల్లించి ఇంటికొచ్చారో లేదో.. వారికి ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలయ్యారు. 1000 బిల్ కట్టి బిర్యానీ తింటే ఆ ఫ్యామిలిలో ఎనిమిదిమందికి లక్ష బిల్లు కట్టి ఆసుపత్రి నుంచి బయటపడిన వార్త మరింత షాక్ కి గురి చేస్తుంది.
మరి ఇంట్లోనే అన్నం వండుకుని ఆవకాయ్ వేసుకుని తిన్నంత ఉత్తమం మరొకటి ఉండదని చాలామంది డిసైడ్ ఆయినా.. కొంతమందికి గతిలేక రెస్టారెంట్స్ ని సంప్రదించాల్సిన అగత్యం ఏర్పడడంతోనే ఇలా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.