Advertisementt

మెగాస్టార్ కి గోల్డెన్ వీసా

Tue 28th May 2024 05:38 PM
chiranjeevi  మెగాస్టార్ కి గోల్డెన్ వీసా
Mega Star Chiranjeevi gets golden visa మెగాస్టార్ కి గోల్డెన్ వీసా
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ లాంటి అవార్డు అందుకున్న కొద్ధిరోజుల్లోనే మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి మెగాస్టార్ గోల్డెన్‌ వీసాను అందుకున్నారు. UAE ప్రభుత్వం 10 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబ‌డిదారులు, వ్య‌వ‌స్థాప‌కులు, సాహిత్యం, విద్య‌ ఇలా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రత్యేకమైన వీసాలని ఇస్తూ ఉంటుంది. 

ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో UAE గోల్డెన్ వీసా అందుకున్న వారిలో రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ చేరగా, అల్లు అర్జున్, షారుక్ ఖాన్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్ లాల్, మమ్ముట్టి, టొవినో ధామస్, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన లు ఇప్పటివరకు గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉన్నారు. 

ఈ గోల్డెన్‌ వీసాతో అరబ్‌ దేశాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. అంతేకాకుండా UAEలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్నాళ్లయినా నివ‌సించవచ్చు. అక్కడి పౌరులుగా UAE ప్ర‌భుత్వం క‌ల్పించే అన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గోల్డెన్ వీసాను అదుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

 

Mega Star Chiranjeevi gets golden visa :

UAE honours method Mega Star Chiranjeevi

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ