ఎన్టీఆర్ అభిమానులు తిడుతున్నారంటూ ఎన్టీఆర్ కి మొరపెట్టుకుంటున్న టీడీపీ కార్యకర్తలు, నేతలని చూసి వాళ్ళని కెలకడమెందుకు, తిట్టించుకోవడం ఎందుకు అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గా బుద్ధా వెంకన్న టీడీపీ కి ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు అంటూ చేసిన కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవడమే కాదు, ఎన్టీఆర్ కి యాంటీ అనుకున్న వాళ్ళని ట్రోల్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ బ్రో నీ ఫ్యాన్స్ లో కొంతమంది లేకి వెధవల్ని చూస్తే కోపమొస్తుంది, వాళ్ళని కంట్రోల్ చెయ్ అని ట్వీట్స్ చేసేవారు.. ఇప్పుడు మరోమారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యారు. ఈరోజు తారక్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వెళ్ళగానే అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్ అభిమానులు సీఎం సీఎం అంటూ కేకలు వెయ్యడం మీడియాలో హైలెట్ అయ్యింది. చిన్న ఎన్టీఆర్ సీఎం సీఎం అని ఇప్పుడే కాదు చాలా చోట్ల అభిమానులు అరవడం చూస్తుంటాము. ఇది తట్టుకోలేని కొంతమంది ఇండైరెక్ట్ గా..
బౌన్సర్‌కి 1000
అరిసినోళ్ళకి 500
ఇస్తున్నారంట ఈరోజు తెలంగాణలో. 🤣🤣🤣
గమనిక :ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నాకు సంబందం లేదు అంటూ.. అదేదో ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకున్న అభిమానులే సీఎం సీఎం అని అరిచారంటూ ఇండైరెక్ట్ గా కామెంట్ చెయ్యడమెందుకు, ఎన్టీఆర్ ఫాన్స్ తిడితే తిట్టారంటూ ఏడవడమెందుకు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.