నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం రేజింగ్ లో ఉన్న హీరోయిన్. పుష్ప పాన్ ఇండియా ఫిలిం తో పాటుగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో మూవీస్ చేస్తున్న రష్మిక తమిళ నాట క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కుబేర చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం క్షణం తీరిక లేని రష్మిక టైమ్ మాములుగా స్టార్ట్ అవ్వలేదు. హిందీ స్టార్ హీరో సల్మాన్ సరసన సికిందర్ లో ఛాన్స్ కొట్టేసింది.
మురుగదాస్ తెరకెక్కిస్తున్న సికిందర్ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తుంది. మరి ఇంత క్రేజీగా కేరీర్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నకి దర్శకధీరుడు రాజమౌళి తో పని చేయాలనుందట. రాజమౌళితో పని చేయాలి అని ఏ హీరోయిన్ కి ఉండదు. ఇప్పుడు రాజమౌళి మొత్తం పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు
అలాంటి దర్శకుడితో సినిమా చేయాలనుంది అంటూ రష్మిక డైరెక్టుగానే అడిగేస్తుంది. గత రాత్రి ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేష్ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక తనకి రాజమౌళితో పని చెయ్యాలనుంది అనే కొరికని బయటపెట్టగా.. హమ్మ రష్మిక రాజమౌళికి బాగానే గాలం వేస్తున్నావే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.