అనసూయ తొమ్మిదేళ్ల పాటు భరద్వాజ్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది అనసూయ ప్రస్తుతం సినీ ఫీల్డ్ లో ఉండడంతో ఆమె భర్త పిల్లలతో సహా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యింది. భర్త భరద్వాజ్, అలాగే కొడుకులిద్దరితో అనసూయ వెకేషన్స్ కి వెళుతూ చిట్టి పొట్టి బట్టలు వేసుకుని సందడి చేస్తూ ఉండడం చూస్తుంటాము.
గ్లామర్ షో కి కేరాఫ్ గా అనసూయ షో ఉంటుంది. ఈమధ్యన అనసూయ బర్త్ డే కూడా ఫ్యామిలీతో వెకేషన్ లోనే సెలెబ్రేట్ చేసుకుంది. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ట్రెక్కింగ్ అంటూ కొడుకులు, భర్త భరద్వాజ్ తో ఎంజాయ్ చేసిన అనసూయకి ఓ పాప కావాలనే కోరిక కోరికగానే మిగిలిపోయింది. తనకి ఆడపిల్ల అంటే ఇష్టమని, కానీ ఇద్దరూ అబ్బయిలే పుట్టారని చెబుతుంది..
ఆడపిల్ల ఉంటే ఇల్లుని చక్కబెడుతుంది, ఇల్లంతా నిండుగా ఉంటుంది.. కానీ నా భర్త నాకు కోపరేట్ చెయ్యడు, కనేసి నువ్వు నీ పని మీద వెళ్ళిపోతావ్, పెంచేది నేనేగా అని అంటూ సరదాగా ఆటపట్టిస్తాడని అనసూయ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎప్పుడు అత్తింటి కబుర్లు చెప్పని అనసూయ మొదటిసారి బీహార్ లో తన అత్తింటికి వెళితే అక్కడ ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది.
తాను భర్త భరద్వాజ్ వాళ్ళ ఇంటికి బీహార్ వెళితే అక్కడ చాలా సంప్రదాయంగా ఉండాలి, నెత్తి మీద చీర కొంగుకప్పుకునే ఉండాలి, ఎవ్వరికి కనిపించకుండా మొహం దాచుకోవాలి, నేను వెళ్లినా అక్కడ అలానే చీర కొంగు కప్పుకుంటాను, అంతేకాదు.. ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరి కాళ్ళకి దణ్ణం పెట్టాలి అంటూ అనసూయ అత్తింటి ముచ్చట్లని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిది.
తనని అత్తింటివారు ప్రేమగా చూడడమే కాదు చీర అవి ఇవి పెడతారని అనసూయ చెప్పింది. మరి ఇక్కడ హైదరాబాద్ లో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకునే అనసూయ అత్తింట్లో చీర కొంగు కప్పుకుని ఉండడమంటే ఆచారం పాటించినట్లేకదా..!